
GT Vs CSK, IPL 2023 Weather Updates: చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మధ్య ఫైనల్ క్లాష్ జరగబోతోంది. ఐపీఎల్ 2023 ఫైనల్‌కు అహ్మదాబాద్ స్టేడియం పూర్తిగా సిద్ధంగా ఉంది. ఫైనల్ పోరు కోసం ఇరు జట్లు కూడా స్టేడియానికి చేరుకున్నాయి. వరుసగా రెండోసారి ఛాంపియన్‌గా నిలవాలనే ఉద్దేశ్యంతో గుజరాత్ రంగంలోకి దిగుతుండగా, 5వ సారి టైటిల్ గెలవాలని చెన్నై ఉవ్విళ్లూరుతోంది. ఫైనల్‌పై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.అయితే ఇంతలో వాతావరణం టెన్షన్‌ని పెంచింది. సాయంత్రం 8 నుంచి 9 గంటల మధ్య వర్షం పడే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిలో, ఇరుజట్లతోపాటు అభిమానుల్లో టెన్షన్ మొదలైంది.
‘AcuWeather’ నివేదిక ప్రకారం, IPL 2023 ఫైనల్ రోజు, మే 28 ఆదివారం నాడు 40 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఈరోజు అహ్మదాబాద్‌లో 2 గంటల పాటు వర్షం కురిసే అవకాశం ఉంది. సాయంత్రానికి వర్షం ముప్పు పెరుగుతుంది. సూర్యుడు అస్తమించిన వెంటనే తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.
గాలి గంటకు 50 కి.మీ వేగంతో వీస్తుంది. ఇది కాకుండా, వాతావరణ శాఖ పంచుకున్న డేటా ప్రకారం, ఈ సాయంత్రం ఎక్కువ వర్షం పడదు. కానీ, చీకటి మేఘాలు కమ్ముకోవచ్చు. అభిమానులు మ్యాచ్ మొత్తం చూసేందుకు వస్తారా లేదా వర్షం మ్యాచ్‌కు ఆటంకం కలిగిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..