IPL 2023 Orange Cap Winner: 3 సెంచరీలతో 890 పరుగులు.. ఆరెంజ్ క్యాప్‌తో టీమిండియా ఫ్యూచర్ స్టార్ భారీ రికార్డ్..
IPL 2023 Final Orange Cap Holder: ఈ సీజన్ శుభ్‌మాన్ గిల్‌కి ఎంతో కలిసి వచ్చింది. ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ తర్వాత రెండో స్థానంలో నిలిచాడు.
గుజరాత్ టైటాన్స్ స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఐపీఎల్ 2022 సీజన్‌ను ఎలా ముగించాడో ఐపీఎల్ 2023 సీజన్‌ను అదే విధంగా ప్రారంభించాడు. భారత క్రికెట్ భవిష్యత్తుగా గిల్ తనపై ఉంచిన ప్రతి నిరీక్షణను సమర్థించుకున్న సీజన్‌గా మార్చుకున్నాడు. అహ్మదాబాద్‌లో జరిగిన సీజన్ ముగింపు మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్‌తో, గిల్ అత్యధిక పరుగులతో ఆరెంజ్ క్యాప్‌ను కైవసం చేసుకున్నాడు. అదే బాటలో మరో రికార్డు కూడా సృష్టించాడు.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో మార్చి 31న జరిగిన సీజన్‌లోని మొదటి మ్యాచ్‌లో గిల్ చెన్నై సూపర్ కింగ్స్‌పై అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించాడు. అప్పుడు గిల్ వేగంగా 63 పరుగులు చేశాడు. ఈ సీజన్‌లో చివరి మ్యాచ్‌లో అంటే ఫైనల్‌లో ఈ మైదానంలో మరోసారి తన సత్తా చాటుకున్నాడు. చెన్నైపై గుజరాత్‌కు శుభారంభాన్ని అందించిన గిల్ 39 పరుగులు చేసిన తర్వాత ఔటయ్యాడు.
890 పరుగులతో ఆరెంజ్ క్యాప్..
ఈ సీజన్‌లో శుభ్‌మాన్ గిల్ తన బ్యాట్‌తో పరుగుల వర్షం కురిపించాడు. ఇది అతన్ని IPL 2023లో అత్యంత విజయవంతమైన బ్యాట్స్‌మెన్‌గా చేసింది. గుజరాత్ ఓపెనర్ ఐపీఎల్ 2023లో 17 ఇన్నింగ్స్‌ల్లో బాదేశాడు. తన బ్యాట్‌తో 890 పరుగులు చేశాడు. అతని సగటు 59.33 కాగా, స్ట్రైక్ రేట్ 157.80. ఈ సీజన్‌లో గిల్ 3 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలు కూడా సాధించాడు. అతని బ్యాట్‌లో 85 ఫోర్లు, 33 సిక్సర్లు కూడా వచ్చాయి.
Brief but looking dangerous – Shubman Gill was in the mood tonight.#TATAIPL #CSKvGT #IPLonJioCinema #IPLFinal pic.twitter.com/B1IeAqAHCL
— JioCinema (@JioCinema) May 29, 2023