13 బంతుల్లో పెను విధ్వంసం.. మ్యాచ్‌ను మలుపు తిప్పేశారు.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు..

| Edited By: Anil kumar poka

Oct 09, 2021 | 3:05 PM

టీ20 మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. గెలుస్తుందని ఊహించిన టీమ్ ఓడిపోవచ్చు.. ఓడిపోతుందనుకున్న జట్టు అద్భుత..

13 బంతుల్లో పెను విధ్వంసం.. మ్యాచ్‌ను మలుపు తిప్పేశారు.. జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు..
Cricket
Follow us on

టీ20 మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. గెలుస్తుందని ఊహించిన టీమ్ ఓడిపోవచ్చు.. ఓడిపోతుందనుకున్న జట్టు అద్భుత విజయాన్ని అందుకోవచ్చు. సరిగ్గా ఈ పరిణామాన్ని అడ్డం పట్టేలా తాజాగా ఓ మ్యాచ్ జరిగింది. 13 బంతులు మొత్తం మ్యాచ్‌ను మలుపు తిప్పాయి. ఇద్దరు బ్యాట్స్‌మెన్లు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి తమ జట్టు అద్భుత విజయాన్ని అందించారు. 28 ఏళ్ల బ్యాట్స్‌మెన్ ఈ గేమ్ స్టార్ట్ చేయగా.. 34 ఏళ్ల బ్యాట్స్‌‌మెన్ సిక్సర్‌తో ముగించాడు. ఆ మ్యాచ్ ఏంటో తెలుసుకుందాం పదండి..

ఇటీవల పాపువా న్యూగినియా, స్కాట్లాండ్ మధ్య టీ20 మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన పాపువా న్యూ గినియా మొదట బ్యాటింగ్ చేసింది. కెప్టెన్, ఓపెనర్ అసద్ వాలా 55 పరుగులు చేయడంతో పాపువా న్యూగినియా జట్టు 20 ఓవర్లలో 5 వికెట్లకు 154 పరుగులు చేసింది. స్కాట్‌ల్యాండ్ బౌలర్ హంజా తాహిర్ 2 వికెట్లు తీశాడు.

ఇక లక్ష్యచేధనలో భాగంగా బ్యాటింగ్‌కు దిగిన స్కాట్లాండ్ 20 ఓవర్లలో 155 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇద్దరు బ్యాట్స్‌మెన్లు కీలక పాత్ర పోషించారు. 28 ఏళ్ల జార్జ్ మున్సే గేమ్ స్టార్ట్ చేయగా.. 34 ఏళ్ల రిచీ బేరింగ్టన్ సిక్స్‌తో ముగించాడు. జార్జ్ మున్సే 33 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 50 పరుగులు చేశాడు. అదే సమయంలో, బెర్రింగ్టన్ 28 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇద్దరూ న్యూగినియా బౌలర్లను ఊచకోత కోశారు. మధ్య ఓవర్లలో పెను విధ్వంసాన్ని సృష్టించి 8 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌కు అద్భుత విజయాన్ని అందించారు.

13 బంతులు కీలకం.!

టార్గెట్‌ను చేధించే క్రమంలో ఈ ఇద్దరూ 13 బంతుల్లో 58 పరుగులు రాబట్టారు. దీని ద్వారానే మ్యాచ్‌ను పూర్తిగా మలుపు తిప్పారు. ఇక బెర్రింగ్టన్ చివరి బంతికి సిక్స్ కొట్టి స్కాట్లాండ్‌కు విజయం అందించారు.

Read Also: సమంత పిల్లల్ని కనాలనుకుంది.. షాకింగ్ నిజాలు బయటపెట్టిన నీలిమ గుణ..

ఇంటి దారి పట్టిన డిఫెండింగ్ ఛాంపియన్స్.. ప్లేఆఫ్స్‌కి అంతా సిద్దం..

చివరి బంతికి సిక్స్ కొట్టాడు.. అవార్డులను కొల్లగొట్టాడు.. ఈ ఆర్‌సీబీ ప్లేయర్ లాస్ట్ మ్యాచ్ సంపాదన ఎంతో తెలుసా?

మానిటర్ బల్లిపై చిరుత మెరుపు దాడి.. ఎటాక్‌ మాములుగా లేదు.. వీడియో చూస్తే షాకవుతారు.!