
మరికొద్ది రోజుల్లో టీమిండియా మాజీ ఓపెనర్, కేకేఆర్ కోచ్ గౌతమ్ గంభీర్.. టీమిండియాకి హెడ్ కోచ్ కానున్నాడు. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. శ్రీలంకకు టీమిండియా పర్యటన సమయంలో గంభీర్ కోచ్ బాధ్యతలను చేపట్టనున్నాడని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ లో గంభీర్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కున్నాడు. మొదటిగా టెస్టుల్లో ఓపెనర్‌గా నిలదొక్కుకున్న తర్వాతే అతడి గ్రాఫ్ అమాంతం దూసుకుపోయింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తనను స్లెడ్జ్ చేసేడని.. అది తనకు ప్లస్ పాయింట్ అయిందన్న విషయాన్ని గంభీర్ ఇటీవల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
గంభీర్ 2008లో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ద్వారా లైమ్ లైట్‌లోకి వచ్చాడు. ఆ సమయంలో ఆసీస్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్.. గంభీర్ ను టార్గెట్ చేస్తూ.. స్లెడ్జింగ్ చేశాడు. ఇక అంటే ధీటుగా బ్యాట్ తో బదులిచ్చాడు గంభీర్. ఆ సిరీస్ లో అత్యధిక స్కోరర్ గా నిలిచాడు. మొత్తంగా 3 టెస్టు మ్యాచ్ లు ఆడిన గంభీర్ 77 కంటే ఎక్కువ సగటుతో 463 పరుగులు చేశాడు.
‘ అది నా మొదటి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ. సిల్లీ పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తోన్న రికీ పాంటింగ్.. నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ‘నువ్వు ఏం సాధించలేదు ఇంతవరకు అని’ స్లెడ్జింగ్ చేశాడు. కట్ చేస్తే.. ఆ సిరీస్‌లో నేను టాప్ స్కోరర్‌గా నిలిచాను’. రికీ అలా స్లెడ్జ్ చేయగానే.. నేను కూడా నా నోటికి పని చెప్పాను. ‘భారత్‌లో నువ్వు సాధించింది కూడా ఏమీ లేదు. ఇండియాలో నువ్వు నిజంగా ఒక బన్నీ’ అని చెప్పాను. కాగా, ఆ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గంభీర్ ఒక సెంచరీ, డబుల్ సెంచరీ కొట్టగా.. రికీ పాంటింగ్ పూర్తిగా పేలవ ప్రదర్శన కనబరిచాడు.
దిగ్గజ బ్యాటర్ అయిన రికీ పాంటింగ్.. సచిన్ టెండూల్కర్ తర్వాత అత్యధిక పరుగుల చేసిన క్రికెటర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. అయితే ఇండియాలో మాత్రం రికీ ట్రాక్ రికార్డు వరస్ట్ అని చెప్పొచ్చు. ఈ ఆసీస్ మాజీ కెప్టెన్ భారత్‌లో 14 టెస్టులు ఆడాడు. కేవలం 26.48 యావరేజ్‌తో ఒకే ఒక్క సెంచరీ కొట్టాడు. కాగా, ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్ గా రికీ పాంటింగ్ వ్యవరిస్తుంటే.. గౌతమ్ గంభీర్ కోల్ కతా నైట్ రైడర్స్ కి మెంటార్ గా ఉన్నాడు.
ఇది చదవండి: అదే జరిగితే.. టీ20 ప్రపంచకప్ నుంచి అర్ధాంతరంగా టీమిండియా ఔట్.? లెక్కలివే
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..