ఇవేం రూల్స్..ఐసీసీపై గంభీర్ గుస్సా!
వరల్డ్ కప్ 2019 ఫైనల్స్‌లో న్యూజిలాండ్ టీమ్ ఓడిపోయింది అని ఐసీసీ చెబుతున్నా... క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు మాత్రం ఆ విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. కప్పు ఇంగ్లాండ్ గెలుచుకున్నా... న్యూజిలాండ్ మాత్రం అందరి మనసు గెలుచుకుందని చెబుతున్నారు. ఆదివారం అర్థరాత్రి వరకు కొనాసగిన ఈ ఉత్కంఠ పోరులో ..
వరల్డ్ కప్ 2019 ఫైనల్స్‌లో న్యూజిలాండ్ టీమ్ ఓడిపోయింది అని ఐసీసీ చెబుతున్నా… క్రికెట్ అభిమానులు, మాజీ క్రికెటర్లు మాత్రం ఆ విషయం జీర్ణించుకోలేకపోతున్నారు. కప్పు ఇంగ్లాండ్ గెలుచుకున్నా… న్యూజిలాండ్ మాత్రం అందరి మనసు గెలుచుకుందని చెబుతున్నారు. ఆదివారం అర్థరాత్రి వరకు కొనాసగిన ఈ ఉత్కంఠ పోరులో … రెండు జట్ల స్కోర్లు టై అయ్యాయి. సూపర్ ఓవర్‌లో కూడా ఇరు జట్లు సమాన స్కోరు చెయ్యడంతో.. మ్యాచ్ టై అయ్యింది. దీంతో బౌండరీలను లెక్కలోకి తీసుకున్న ఐసీసీ ఇంగ్లండ్‌నే విశ్వ విజేతగా ప్రకటించింది. ఆ సమయంలో.. గెలుపు వాకిట వరకు వెళ్లి వచ్చిన న్యూజిలాండ్ టీం ఆవేదన మాత్రం వర్ణనాతీతం. ఈ ఓటమి మమ్మల్ని నైరాశ్యంలోకి నెట్టిందని మ్యాచ్ అనంతరం ఆ టీం కెప్టెన్ కేన్ విలియమ్‌సన్ అన్నాడు.
బౌండరీ కౌంట్ నిబంధన ‘హాస్యాస్పదంగా’ ఉందని పేర్కొంటూ భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఐసీసీపై విరుచుకుపడ్డాడు. అత్యంత ప్రతిష్టాత్మక వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌లో బౌండరీల ద్వారా విజేతను ప్రకటించడంపై గంభీర్ ఐసీసీ తీరును తప్పుపట్టారు. ఈ తరహా విధానం సరైనది కాదంటూ విమర్శించాడు. ఇదొక చెత్త రూల్ అంటూ మండిపడ్డాడు. కాగా, స్పోర్టీవ్ స్పిరిట్‌తో కడవరకూ పోరాడిన ఇరు జట్లను గంభీర్ అభినందించాడు. తన దృష్టిలో ఇరు జట్లు విన్నర్లే అంటూ తన మనసులోని మాటను బహిర్గతం చేశాడు.
Don’t understand how the game of such proportions, the #CWC19Final, is finally decided on who scored the most boundaries. A ridiculous rule @ICC. Should have been a tie. I want to congratulate both @BLACKCAPS & @englandcricket on playing out a nail biting Final. Both winners imo.
— Gautam Gambhir (@GautamGambhir) July 14, 2019
అయితే ప్రస్తుతం ఐసీసీ నియామవళి, నింబంధనలు పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. సూపర్ ఓవర్‌లో స్కోర్లు ఈక్వల్ అయిన నేపథ్యంలో ఇరు జట్లని విజేతలుగా ప్రకటించాలని కొందరంటుంటే..కేవలం బ్యాటింగ్ పక్షంగా నియమాలు ఉన్నాయని..వికెట్ల పరంగా ఆలోచిస్తే ఎక్కువ వికెట్లు తీసిన న్యూజిలాండ్ విజేత అవ్వాలని కొందరు అభిప్రాయపడుతున్నారు.