
ప్రతిష్టాత్మక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సమరాన్ని టీమిండియా మొదలుపెట్టేసింది. గురువారం దుబాయ్‌లోని ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడుతుంది. అయితే ఈ మ్యాచ్‌కి ముందు టీమిండియా స్టార్ ప్లేయర్‌తో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు మధ్య హాట్ డిస్క్రషన్ నడిచినట్లు తెలుస్తోంది. అదేంటంటే.. బంగ్లాదేశ్‌తో ఆడే ప్లేయింగ్ ఎలెవన్‌లో ఛాన్స్ గురించి గంభీర్.. రవీంద్ర జడేజాతో మొహమాటం లేకుండా ముఖంపైనే నువ్వు టీమ్‌లో ఉండవ్ అని చెప్పినట్లు ప్రచారం సాగుతోంది.
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన స్క్వౌడ్‌లో ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లు ఉన్న విషయం తెలిసిందే. అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్. ఈ ముగ్గురిలో జడేజాను పక్కనపెట్టి, మిగతా ఇద్దర్ని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలని గంభీర్ భావంచాడంటా.. ఇదే విషయాన్ని జడేజాకు చెప్పినట్లు పలు వార్తలు వచ్చాయి. కానీ, తీరా టాస్ కోసం వచ్చిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి జడేజా తిరిగి వచ్చాడంటూ పేర్కొన్నాడు. అయితే గంభీర్ మ్యాచ్‌కి ముందు జడేజాతో మాట్లాడిన విషయంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే టాస్ గెలవడం, ఓడటాన్ని బట్టి ప్లేయింగ్‌లో మార్పులు ఉంటాయని గంభీర్ చెప్పి ఉండొచ్చని క్రికెట్ నిపుణులు అంటున్నారు. అయితే బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో టాస్ ఓడిపోయిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత ఫీల్డింగ్ చేయాల్సి వస్తుంది. అయితే తాము ముందుగా ఫీల్డింగే చేయాలని అనుకున్నామని, లైట్స్‌లో బ్యాటింగ్ ఈజీగా ఉంటుందని, బ్యాట్‌పై బాల్ బాగా వస్తుందని భావిస్తున్నట్లు రోహిత్ శర్మ వెల్లడించారు. అలాగే ఇంగ్లండ్‌తో చివరి వన్డే ఆడిన వరణ్ చక్రవర్తిని ఈ మ్యాచ్‌లో పక్కనపెట్టారు. అలాగే కచ్చితంగా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటాడని అనుకున్న అర్షదీప్ సింగ్‌కు కూడా షాకిస్తూ అతన్ని పక్కనపెట్టారు.
భారత్ ప్లేయింగ్ ఎలెవన్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.