Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Test Cricket: వామ్మో ఏంది సామీ మీరు.. టెస్ట్‌ల్లో సిక్స్‌లతో దడ పుట్టించారుగా.. లిస్టులో భారత ఆటగాళ్లు ముగ్గురు..

టీ20 ఫార్మాట్‌లోకి వచ్చిన తర్వాత టెస్టు క్రికెట్‌లో కూడా బ్యాట్స్‌మెన్స్ దూకుడుగా ఆడడం ప్రారంభించారు. టెస్టు క్రికెట్‌లో కూడా చాలా సిక్సర్లు బాదడానికి ఇదే కారణం. అయితే, టీ20కి ముందు కూడా, దూకుడు వైఖరికి ప్రసిద్ధి చెంది, ఫోర్లు, సిక్సర్లు కొట్టే ఆటగాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు, మనం ప్రపంచ క్రికెట్ గురించి మాట్లాడితే, ఆడమ్ గిల్‌క్రిస్ట్, సనత్ జయసూర్య, క్రిస్ గేల్ వంటి బ్యాట్స్‌మెన్స్ టెస్ట్ క్రికెట్‌లోనూ దూకుడు శైలితో దూసుకపోతుంటారు.

Test Cricket: వామ్మో ఏంది సామీ మీరు.. టెస్ట్‌ల్లో సిక్స్‌లతో దడ పుట్టించారుగా.. లిస్టులో భారత ఆటగాళ్లు ముగ్గురు..
Test Cricket Sixes
Venkata Chari
|

Updated on: Dec 30, 2023 | 5:20 PM

Share

Indian Cricket Team: టెస్ట్ క్రికెట్ అనేది బ్యాట్స్‌మెన్‌కు పూర్తి సమయం లభించే ఫార్మాట్. ఇక్కడ పరుగులు చేయడానికి తొందరపడాల్సిన అవసరం లేదు. బ్యాట్స్‌మెన్ క్రీజులో గడిపేస్తూ హాయిగా భారీగా పరుగులు రాబట్టే అవకాశం ఉంది. అయితే, టెస్ట్ క్రికెట్‌లో కూడా చాలా వేగంగా పరుగులు చేసి ఫోర్లు, సిక్సర్లు కొట్టే బ్యాట్స్‌మెన్స్ చాలా మందే ఉన్నారు.

టీ20 ఫార్మాట్‌లోకి వచ్చిన తర్వాత టెస్టు క్రికెట్‌లో కూడా బ్యాట్స్‌మెన్స్ దూకుడుగా ఆడడం ప్రారంభించారు. టెస్టు క్రికెట్‌లో కూడా చాలా సిక్సర్లు బాదడానికి ఇదే కారణం. అయితే, టీ20కి ముందు కూడా, దూకుడు వైఖరికి ప్రసిద్ధి చెంది, ఫోర్లు, సిక్సర్లు కొట్టే ఆటగాళ్ళు చాలా మంది ఉన్నారు. ఉదాహరణకు, మనం ప్రపంచ క్రికెట్ గురించి మాట్లాడితే, ఆడమ్ గిల్‌క్రిస్ట్, సనత్ జయసూర్య, క్రిస్ గేల్ వంటి బ్యాట్స్‌మెన్స్ టెస్ట్ క్రికెట్‌లోనూ దూకుడు శైలితో దూసుకపోతుంటారు.

టెస్టు క్రికెట్‌లో భారీగా సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌లు చాలా మంది ఉన్నారు. ఈ క్రమంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాబితాలో ఉన్న భారత బ్యాట్స్‌మెన్స్ ఎవరో చూద్దాం..

టెస్టు క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన టాప్ 3 భారత బ్యాట్స్‌మెన్స్..

1. వీరేంద్ర సెహ్వాగ్ – 91 సిక్సర్లు..

భారత జట్టు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన దూకుడు వైఖరికి పేరుగాంచాడు. ఫార్మాట్ ఏదైనప్పటికీ తనదైన శైలిలో వేగంగా బ్యాటింగ్ చేసేవాడు. కెరీర్‌లో తొలిసారి 300 పరుగులకు చేరువగా వచ్చినా.. సిక్స్ కొట్టడం ద్వారానే ఈ రికార్డును పూర్తి చేశాడు.

వీరేంద్ర సెహ్వాగ్ తన టెస్టు కెరీర్‌లో మొత్తం 104 మ్యాచ్‌లు ఆడి 8586 పరుగులు చేశాడు. 91 టెస్టుల్లో మొత్తం 104 సిక్సర్లు కొట్టాడు. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

2. ఎంఎస్ ధోని – 78 సిక్సర్లు..

ఈ జాబితాలో మాజీ లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రెండో స్థానంలో ఉన్నాడు. వన్డేల్లో ధోనీ ఎంత గొప్ప ఆటగాడో, టెస్టు క్రికెట్‌లో మాత్రం అతని కెరీర్ అంత గొప్పగా లేదు. 90 టెస్టు మ్యాచ్‌లు ఆడిన తర్వాత రిటైరయ్యాడు. అయితే, ఈ కాలంలో అతను తనకు తెలిసిన ఫార్మాట్‌లోనే బ్యాటింగ్ చేశాడు.

ఎంఎస్ ధోని టెస్ట్ మ్యాచ్‌లలో 4876 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను భారత జట్టు తరపున మొత్తం 78 సిక్సర్లు కొట్టాడు. ఎంఎస్ ధోని చాలా మ్యాచ్‌లలో బ్యాటింగ్ చేయలేదు. అతను 90 టెస్టుల్లో 144 ఇన్నింగ్స్‌లు మాత్రమే ఆడాడు.

3. సచిన్ టెండూల్కర్ – 69 సిక్సర్లు..

భారత బ్యాట్స్‌మెన్లలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాళ్ల జాబితాలో సచిన్ టెండూల్కర్ మూడో స్థానంలో ఉన్నాడు. సచిన్ టెస్ట్ క్రికెట్‌లోని దాదాపు అన్ని రికార్డులను కలిగి ఉన్నాడు. అతను ఈ ఫార్మాట్‌లో సుమారు 16 వేల పరుగులు చేశాడు. టెస్టు క్రికెట్‌లో అతని పేరిట 51 సెంచరీలు కూడా ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 200 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 329 ఇన్నింగ్స్‌లలో మొత్తం 69 సిక్సర్లు కొట్టాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..