T20 Cricket: టీ20 ఫార్మాట్‌లో దంచికొట్టిన ప్లేయర్లు.. టాప్ 5లో టీమిండియా నుంచి ఒకే ఒక్కడు..
టీ20 క్రికెట్‌లో గతేడాది ఎంతోమంది ఆటగాళ్లు తమ బ్యాట్‌లతో సత్తా చాటాడు. పరుగుల వర్షం కురిపించారు. దాదాపు అన్ని జట్లు టీ20 మ్యాచ్‌లు ఆడాయి. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు కూడా బద్దలయ్యాయి. ఇటువంటి పరిస్థితిలో 2023 సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్ పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం..
T20 Cricket: టీ20 ప్రపంచ కప్ (ICC T20I World Cup 2024) 2024లో నిర్వహించనున్నారు. ఇందుకోసం అన్ని టీమ్‌లు ముమ్మరంగా సిద్ధమవుతున్నాయి. 2023లో కూడా అన్ని జట్ల మధ్య అనేక టీ20 సిరీస్‌లు జరిగాయి. ఇందులో బ్యాట్స్‌మెన్స్ తమ బ్యాట్‌లతో సందడి చేశారు. ఇటువంటి పరిస్థితిలో 2023 సంవత్సరంలో అత్యధిక పరుగులు చేసిన ఐదుగురు బ్యాట్స్‌మెన్ పేర్లను ఇప్పుడు తెలుసుకుందాం..
5. విరణ్‌దీప్ సింగ్ – మలేషియా బ్యాట్స్‌మెన్ విరందీప్ సింగ్ 2023 సంవత్సరంలో T20 ఇంటర్నేషనల్‌లో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. అతను 2023లో 21 మ్యాచ్‌లు ఆడాడు, అందులో అతను 1 సెంచరీ, 5 అర్ధ సెంచరీల సహాయంతో 665 పరుగులు చేశాడు. ఈ మలేషియా బ్యాట్స్‌మెన్ అత్యధిక స్కోరు 116* పరుగులుగా నిలిచింది.
4. సైమన్ సెసాజీ – ఉగాండా బ్యాట్స్‌మెన్ సైమన్ సెసాజీ 2023లో జరిగిన T20 ఇంటర్నేషనల్‌లో బ్యాట్‌తో బీభత్సం చేశాడు. అతను 2023లో 33 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 5 అర్ధ సెంచరీల సహాయంతో 725 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 60 పరుగులుగా నిలిచింది.
3. సూర్యకుమార్ యాదవ్ – భారత జట్టు స్టార్ బ్యాట్స్‌మెన్, ICC T20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌కు 2023 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది టీ20 ఫార్మాట్‌లో అతని బ్యాట్ ఆకట్టుకుంది. అతను 18 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో సూర్యకుమార్ యాదవ్ 2 సెంచరీలు, 5 అర్ధ సెంచరీల సహాయంతో 733 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 112* పరుగులుగా నిలిచింది.
2. రోజర్ ముకాసా – ఉగాండా బ్యాట్స్‌మెన్ రోజర్ ముకాసా 2023 సంవత్సరంలో 31 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో అతను 2 అర్ధ సెంచరీలు సాధించాడు. 2023లో 738 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20లో అతని అత్యుత్తమ స్కోరు 89 పరుగులుగా నిలిచింది.
1. ముహమ్మద్ వాసిమ్ – UAE కెప్టెన్ ముహమ్మద్ వాసిమ్ 2023 సంవత్సరంలో T20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక పరుగులు చేశాడు. 23 మ్యాచ్‌ల్లో 7 అర్ధ సెంచరీల సాయంతో 863 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 91 పరుగులుగా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..