AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: రోహిత్ సేనకు భారీ షాక్.. ఈ 5 గణాంకాలతో వరల్డ్ కప్ ఆశలు గల్లంతే.. అవేంటంటే?

Team India: భారత క్రికెట్ జట్టు ప్రపంచ కప్ 2023లో తన ప్రయాణాన్ని అక్టోబర్ 8 నుంచి ప్రారంభించనుంది. ఈ టోర్నీలో విజయం కోసం భారత్‌ను పోటీదారుగా పరిగణిస్తున్నారు. టీమిండియా ఖచ్చితంగా బలంగా ఉంది. కానీ, ప్రపంచ కప్‌ బరిలో నిలిచిన ఓ ఐదు జట్లు భారత్‌ను ఇబ్బంది పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఎందుకంటే ఈ5 జట్లపై టీమిండియా రికార్డ్ చాలా పేలవంగా నిలిచింది. అందుకే టీమిండియా ట్రోఫీ పోరులో నిలవాలంటే, ఖచ్చితంగా 100 శాతం ప్రదర్శన ఇవ్వా్ల్సిందే.

World Cup 2023: రోహిత్ సేనకు భారీ షాక్.. ఈ 5 గణాంకాలతో వరల్డ్ కప్ ఆశలు గల్లంతే.. అవేంటంటే?
Team India Records
Venkata Chari
|

Updated on: Oct 02, 2023 | 5:01 PM

Share

World Cup 2023: ప్రపంచకప్‌ 2023ను గెలుచుకోవడానికి టీమ్ ఇండియా అతిపెద్ద పోటీదారుగా పరిగణిస్తున్నారు. స్వదేశంలో టీమిండియా రికార్డ్ అటు బ్యాటర్లకు, ఇటు బౌలర్లకు మనోధైర్యాన్ని మరింత పెంచుతోంది. క్రికెట్ నిపుణుల నుంచి అభిమానుల వరకు అందరూ రోహిత్ సేనను ఫేవరేట్‌గా పరిగణించడానికి ఇదే కారణం. అయితే, ప్రపంచకప్ గెలవడానికి టీమ్ ఇండియా అతిపెద్ద పోటీదారుగా పరిగణించాలంటే మరోసారి ఆలోచించాల్సిందే. ఎందుకంటే వరల్డ్ కప్‌లో టీమ్ ఇండియా రికార్డును దెబ్బకొట్టే జట్లు చాలానే ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఐదు జట్లు ఉన్నాయని తెలిస్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు.

ప్రపంచ కప్‌లో ఇలాంటి ఐదు జట్లు ఉన్నాయి. వాటిపై టీమ్ ఇండియా ఎక్కువ మ్యాచ్‌లు ఓడిపోయింది. లేదా గెలుపు, ఓటములు సమానంగా ఉన్నాయి. పూర్తి వివరాలను ఓసారి చూద్దాం..

ఇవి కూడా చదవండి

దెబ్బకొట్టేందుకు ఇంగ్లండ్ సిద్ధం..

ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన 8 మ్యాచ్‌ల్లో టీమిండియా 4 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 3 మ్యాచ్‌లు గెలిచింది. 2011లో రెండు జట్ల మధ్య జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ టై అయింది. ఈసారి కూడా ఇంగ్లండ్ జట్టు పటిష్టంగా ఉంది. గత ప్రపంచకప్‌ను కూడా గెలుచుకుంది.

ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లు కూడా..

ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై కూడా టీమ్‌ఇండియా రికార్డు దారుణంగా ఉంది. ఆస్ట్రేలియాపై భారత్ నాలుగు మ్యాచ్‌లు మాత్రమే గెలుపొందగా, మరోవైపు కంగారూ జట్టు రెండింతలు గెలిచింది. అంటే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా 8 సార్లు టీమ్‌ఇండియాను ఓడించింది. ప్రపంచకప్‌లో భారత్‌పై ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్‌ కూడా పైచేయి సాధించింది. ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఐదు మ్యాచ్‌ల్లో భారత్‌ను ఓడించింది. మూడింటిలో ఓడిపోయింది. ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.

దక్షిణాఫ్రికా, శ్రీలంక కూడా తక్కువేమీ కాదు..

ప్రపంచకప్‌లో మూడు మ్యాచ్‌లలో దక్షిణాఫ్రికా కూడా భారత్‌ను ఓడించింది. టీం ఇండియా కేవలం 2 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. ప్రపంచకప్‌లో శ్రీలంక, భారత్‌ల మధ్య పోటీ సమంగా నెలకొంది. శ్రీలంక నాలుగు మ్యాచ్‌ల్లో భారత్‌ను ఓడించగా, నాలుగింటిలో ఓడిపోయింది. ఈ ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లపై మాత్రమే భారత్ ఎక్కువ మ్యాచ్‌లు గెలిచింది. పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, నెదర్లాండ్స్ ప్రపంచకప్‌లో భారత్‌ను ఎన్నడూ ఓడించలేకపోయాయి.

వన్డే ప్రపంచ కప్‌లో పాల్గొనే భారత్ జట్టు:

భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
టీతో తినడానికి పర్ఫెక్ట్ స్నాక్.. బియ్యం పిండితో కరకరలాడే మురుకుల
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
బాక్సాఫీస్ వద్ద రజనీ తాండవం.. కోలీవుడ్‌లో ఆల్‌టైమ్ ఇండస్ట్రీ హిట్
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
మురసు తుఫాన్ ఎఫెక్ట్.. తెలంగాణలో కూడా అతి భారీ వర్షాలు
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
నా ఓవర్ కాన్సిడెన్స్ వల్ల అన్ని కోల్పోయా.. లేదంటే లైఫ్ వేరేలా..
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
ఇలా పేమెంట్ చేస్తేనే ఆఫ్‌లైన్ టికెట్లకు రూ.10 లక్షల బీమా
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
చిరంజీవి, ఆమని కాంబోలో మిస్సైన సినిమా అదే..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
హేమంత్ కాలు తీసేయాల్సిందే.. రాప్తాడు నిందితుడి ఆరోగ్యంపై..
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
వన్డే సిరీస్‌కు ముందే బిగ్ షాక్.. దూరమైన ఇద్దరు స్టార్ ప్లేయర్స్
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మమితా బైజు అసలు పేరు ఇదే.. ఎలా మారిందంటే..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
మీ ఓటర్ కార్డు పొయిందా..? ఒకే క్లిక్‌తో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
ఫర్నిచర్ షాపులోకి చొచ్చుకెళ్లిన కారు..!
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు
భీమేశ్వర ఆలయ సమీపంలో నాగుపాము.. భయంతో పరుగులు తీసిన భక్తులు