IPL 2025: ఐపీఎల్ మెగా వేలానికి ముందుగా ఊహించని ట్విస్ట్.. ఫ్రాంచైజీల సంచలన నిర్ణయం
ఐపీఎల్ 2025 మొదలు కావడానికి ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. అయితే ఈలోపే ఎడిషన్‌కు ముందుగా జరిగే మెగా వేలం సన్నాహాలు జరుగుతున్నాయి. డిసెంబర్‌లో జరగనున్న ఈ మెగా ఆక్షన్‌కు బీసీసీఐ ఇప్పటికే కొన్ని షరతులు పెట్టింది. ఫ్రాంచైజీలతో చర్చలు జరిపిన క్రికెట్ బోర్డు..
ఐపీఎల్ 2025 మొదలు కావడానికి ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. అయితే ఈలోపే ఎడిషన్‌కు ముందుగా జరిగే మెగా వేలం సన్నాహాలు జరుగుతున్నాయి. డిసెంబర్‌లో జరగనున్న ఈ మెగా ఆక్షన్‌కు బీసీసీఐ ఇప్పటికే కొన్ని షరతులు పెట్టింది. ఫ్రాంచైజీలతో చర్చలు జరిపిన క్రికెట్ బోర్డు.. ప్లేయర్స్ రిటైన్, శాలరీ క్యాప్ విషయంలో స్పష్టం తీసుకుంది. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి.. ఇప్పటిదాకా ప్లేయర్స్ శాలరీ క్యాప్ విషయంలో స్థిరంగా పెరుగుదల కనిపిస్తూ వచ్చింది. 2008లో ఈ మొత్తం 5 మిలియన్ డాలర్లుగా ఉంటే.. ప్రస్తుతం అది 100 మిలియన్ డాలర్లకు చేరింది.
శాలరీ క్యాప్ 20 శాతం పెంపు.?
క్రిక్‌బజ్ కథనం ప్రకారం, అన్ని ఫ్రాంచైజీల సీఈఓలు జీతం పరిమితిని పెంచాలని బీసీసీఐని కోరారట. ఐపీఎల్ 2023 నుంచి ఐపీఎల్ 2024 మధ్య 5 శాతం శాలరీ క్యాప్ పెరగగా(రూ. 95 కోట్ల నుంచి 100 కోట్లు). ఇప్పుడు, ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు జీతం పరిమితిని కనీసం 10 నుంచి 20 శాతం పెంచాలని ఫ్రాంచైజీల హెడ్‌లు కోరారట. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, ఒక్కో ఫ్రాంచైజీ 25 మంది ఆటగాళ్లను(గరిష్టంగా 8 మంది విదేశీ ప్లేయర్స్‌ను) కొనుగోలు చేయవచ్చు. అంటే ఈ ఆటగాళ్లను కొనుగోలు చేయడానికి ఫ్రాంచైజీలకు రూ. 110- రూ. 120 కోట్ల(ఐపీఎల్ 2025 వేలానికి) శాలరీ క్యాప్ ఫిక్స్ చేయవచ్చునని అంచనా. కొనుగోలు పరిమితి అయితే, ఈ ఆటగాళ్లలో కొంతమందిని అలాగే ఉంచుకుంటారు. జీతం పరిమితిని పెంచడం వల్ల ఫ్రాంచైజీలు వేలంలో పర్సు గురించి ఆలోచించకుండా కావాల్సిన ఆటగాళ్లను కొనుగోలు చేసే ఛాన్స్ ఉంటుంది.
సంవత్సరాల్లో IPL జీతం పరిమితి
-
2008 – 5 మిలియన్ డాలర్లు
ఇవి కూడా చదవండి -
2009 – 7 మిలియన్ డాలర్లు
-
2010 – 7 మిలియన్ డాలర్లు
-
2011 – 9 మిలియన్ డాలర్లు
-
2012 – 9 మిలియన్ డాలర్లు
-
2013 – 12.5 మిలియన్ డాలర్లు
-
2014 – రూ.60 కోట్లు
-
2015 – రూ.63 కోట్లు
-
2016 – రూ.66 కోట్లు
-
2017 – రూ.66 కోట్లు
-
2018 – రూ.80 కోట్లు
-
2019 – రూ.82 కోట్లు
-
2020 – రూ.85 కోట్లు
-
2021 – రూ.90 కోట్లు
-
2022 – రూ.90 కోట్లు
-
2023 – రూ.95 కోట్లు
-
2024 – రూ.100 కోట్లు
-
2025 – రూ. 110-120 కోట్లు (అంచనా)
ఇది చదవండి: సికింద్రాబాద్ టూ గుంటూరు.. ఇకపై 3 గంటల్లోనే.! వివరాలు ఇవిగో
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..