T20 World Cup 2024: ఎక్ట్స్ పర్ట్స్ అంచనా.. టీ20 ప్రపంచకప్ సెమీస్ చేరే 4 జట్లు ఇవే! అందరి నోటా ఆ టీమ్ పేరే!

|

May 28, 2024 | 5:15 PM

ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా పోటీపడనున్నాయి. ఇందుకోసం టీమిండియాతో సహా మొత్తం 20 జట్లు తమ ఆటగాళ్ల బృందాన్ని ప్రకటించాయి. చాలా టీమ్స్ ఇప్పటికే న్యూయార్క్ కు కూడా చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించాయి. మరోవైపు టీ 20 ప్రపంచ కప్ లో గెలుపు గుర్రాలపై అప్పుడే డిబేట్లు మొదలయ్యాయి

T20 World Cup 2024: ఎక్ట్స్ పర్ట్స్ అంచనా.. టీ20 ప్రపంచకప్ సెమీస్ చేరే 4 జట్లు ఇవే! అందరి నోటా ఆ టీమ్ పేరే!
ICC T20 World Cup 2024
Follow us on

ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. దీంతో క్రికెట్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు టీ 20 ప్రపంచకప్ పైనే ఉంది. మరో మూడు రోజుల్లో (జూన్ 1) నుంచి ఈ మెగా క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా పోటీపడనున్నాయి. ఇందుకోసం టీమిండియాతో సహా మొత్తం 20 జట్లు తమ ఆటగాళ్ల బృందాన్ని ప్రకటించాయి. చాలా టీమ్స్ ఇప్పటికే న్యూయార్క్ కు కూడా చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించాయి. మరోవైపు టీ 20 ప్రపంచ కప్ లో గెలుపు గుర్రాలపై అప్పుడే డిబేట్లు మొదలయ్యాయి. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, నిపుణులు టీవీ డిబేట్లలో ప్రపంచకప్ ఆడే జట్లపై తమ అంచనాలు వెల్లడిస్తున్నారు. అలా పొట్టి ప్రపంచకప్ పై తాజాగా స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు. సెమీస్ కు చేరే ఇవే జట్లంటూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. వీరిలో అందరూ టీమిండియా తప్పకుండా సెమీస్ చేరుతుందని చెప్పడం విశేషం.
అలాగే దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ మినహా మిగతా వారందరూ ఇంగ్లండ్ కచ్చితంగా సెమీస్ చేరుతుందని జోస్యం చెప్పారు. ఇక ఇదే డిబేట్ లో చాలా మంది పాకిస్తాన్ జట్టు కూడా సమతూకంతో ఉందని, ఆ జట్టు కూడా నాకౌట్ స్టేజ్ కు చేరుతుందన్నారు.

టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనలిస్టులపై ఎవరు, ఏమన్నారంటే?

  • సునీల్‌ గవాస్కర్‌- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌
  • మాథ్యూ హేడెన్‌- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
  • మహమ్మద్‌ కైఫ్‌- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌
  • అంబటి రాయుడు- భారత్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా
  • పాల్‌ కాలింగ్‌వుడ్‌- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌
  • బ్రియాన్‌ లారా- భారత్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, ఆఫ్ఘనిస్తాన్‌
  • క్రిస్‌ మోరిస్‌- భారత్‌, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
  • ఆరోన్‌ ఫించ్‌- భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌
  • టామ్‌ మూడీ- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా
  • శ్రీశాంత్‌- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌

టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‌ప్రీత్‌దీప్ సింగ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్.

రిజర్వ్‌లు:

శుభమన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..