Hardik Pandya: ‘హార్దిక్ చుట్టూ చాలా జరిగాయి.. అన్నీ భరించాడు’.. టీమిండియా ఆల్‌రౌండర్‌కు అండగా హర్భజన్

| Edited By: Ravi Kiran

May 30, 2024 | 11:15 AM

టీం ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం డౌన్ టైమ్‌లో ఉన్నాడు. అన్ని వైపుల నుండి విమర్శలు, ఇబ్బందులను ఎదుర్కోంటున్నాడీ స్టార్ ఆల్ రౌండర్. ఐపీఎల్ 17వ సీజన్‌లో మొదట హార్దిక్ కెప్టెన్సీపై, తర్వాత ఆటతీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Hardik Pandya: హార్దిక్ చుట్టూ చాలా జరిగాయి.. అన్నీ భరించాడు.. టీమిండియా ఆల్‌రౌండర్‌కు అండగా హర్భజన్
Harbhajan Singh, Hardik Pandya
Follow us on

 

టీం ఇండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం డౌన్ టైమ్‌లో ఉన్నాడు. అన్ని వైపుల నుండి విమర్శలు, ఇబ్బందులను ఎదుర్కోంటున్నాడీ స్టార్ ఆల్ రౌండర్. ఐపీఎల్ 17వ సీజన్‌లో మొదట హార్దిక్ కెప్టెన్సీపై, తర్వాత ఆటతీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత, ఇప్పుడు ICC T20 వరల్డ్ కప్ 2024 టోర్నమెంట్ కు ముందు అతని వైవాహిక జీవితంలో తుఫాను గురించి చర్చ జరుగుతోంది. హార్దిక్, అతని భార్య నటి నటాషా స్టాంకోవిచ్ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నట్లు పుకార్లు వస్తున్నాయి.. దీనిపై ఇద్దరూ ఇంకా స్పందించలేదు. అయితే టీ20 ప్రపంచకప్‌ సందర్భంగా హార్దిక్‌తో ఇలా జరగడం భారత క్రికెట్‌కు శుభసూచకం కాదు. ఈ నేపథ్యంలో క్లిష్ట పరిస్థితుల్ ఉన్న హార్దిక్ పాండ్యాకు అండగా నిలిచాడు టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. అతనిలో ధైర్యాన్నినూరిపోసేందుకు ప్రయత్నించాడు. ఒక వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హార్దిక్ విషయంప స్పందించాడు భజ్జీ.. ‘అతను (హార్దిక్‌ని ఉద్దేశించి) టీమ్ ఇండియా బ్లూ జెర్సీతో ఉన్నప్పుడు వేరు. పరుగులు చేయడానికి, వికెట్లు తీయడానికి శాయశక్తులా ప్రయత్నిస్తాడు. హార్దిక్ ఇప్పటి వరకు చాలా భరించాడు కాబట్టి బాగా రాణించాలి. అలాగే, టీమ్ ఇండియా ముఖ్యమైన టోర్నమెంట్‌ లో హార్దిక్‌కి బాగా రాణించాలని కోరుకుంటున్నాను’ అని హర్భజన్ అన్నాడు.

ఇవి కూడా చదవండి

టీ20 ప్రపంచకప్‌లో హార్దిక్ అద్భుతంగా రాణిస్తే టోర్నీలో ముందుకు వెళ్లే సువర్ణావకాశం టీమిండియాకు దక్కుతుందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. ‘హార్దిక్ ఆటతీరు ఆందోళన కలిగించే అంశం. హార్దిక్ చుట్టూ చాలా జరిగింది. గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు హార్దిక్ మారడం పెద్ద మార్పు. అలాగే, ముంబై కెప్టెన్‌గా హార్దిక్‌పై ఎవరూ సానుకూలంగా లేరు’ అని భజ్జీ అభిప్రాయ పడ్డాడు.

న్యూయార్క్ లో హార్దిక్ ప్రాక్టీస్.. వీడియో

 

టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‌ప్రీత్‌దీప్ సింగ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్.

రిజర్వ్‌లు:

శుభమన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..