Pahalgam Attack: ఉగ్రవాదులను సమర్థిస్తూ, భారత్‌పై విషం చిమ్మిన పాక్ మాజీ ప్లేయర్.. కౌంటరిచ్చిన నెటిజన్స్
Pahalgam Terrorist Attack Controversy: పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. భారత ప్రభుత్వం పాకిస్తాన్‌ను నిందిస్తుండగా, పాకిస్తాన్ మాజీ క్రికెట్ ఆటగాడు షోయబ్ రెహ్మాన్ భారత భద్రతా వైఫల్యాన్ని ఆరోపించాడు. మరో మాజీ ఆటగాడు డానిష్ కనేరియా మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. ఈ దాడిపై భారతదేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

Pahalgam Attack: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాద దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో ఉగ్రవాదులు 26 మంది అమాయకులు ప్రాణాలను తీశారు. ఈ దాడిలో పాకిస్తాన్ హస్తం ఉందని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ క్రూరత్వాన్ని ప్రపంచం మొత్తం ఖండించింది. కానీ, ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చే పాకిస్తాన్ ఈ దాడిని అంగీకరించడానికి బదులుగా, భారతదేశంపైనే నిందలు వేస్తోంది. రాజకీయ నాయకుల తర్వాత, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు పహల్గామ్ దాడిపై పిచ్చి కూతలు కూశాడు.
పహల్గామ్ ఉగ్రవాద దాడిపై విషం కక్కిన పాక్ ఆటగాడు..
పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశంలోని ప్రజల్లో పాకిస్తాన్‌పై తీవ్ర ఆగ్రహం ఉంది. ఈ దాడిలో మరణించిన వారికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. కానీ, ప్రతిసారి లాగే, పాకిస్తాన్ రాజకీయ పార్టీలు ఈ దాడికి భారత ప్రభుత్వాన్ని నిందిస్తున్నాయి. అదే సమయంలో, ఈ విషయంపై పాకిస్తాన్ మాజీ క్రికెట్ జట్టు ఆటగాడు షోయబ్ రెహ్మాన్ కూడా స్పందించాడు. ఈ దాడిలో భారత ప్రభుత్వ వైఫల్యాన్ని నిందిదించాడు. ఒక టీవీ షో సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘చూడండి, విషయం ఏమిటంటే దాడి కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగింది. భారతదేశంలో 9 లక్షల మంది సైనికులు ఉన్నారు. ఈ దాడి 9 లక్షల మంది సైనికుల సమక్షంలో జరిగింది. ముందుగా భారత బలగాలు స్పందించాలి. ఇది భద్రతా లోపం, దీనికి మీరు పాకిస్తాన్‌ను ఎలా నిందిస్తారు? అక్కడ మీ భద్రతను మీరు చూసుకోవాలి. భారత్ చాలా పెద్ద దేశం, సూపర్ పవర్ అని పిలుచుకుంటుంటారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రతిదానికీ పాకిస్తాన్‌ను నిందిస్తున్నారు” అంటూ తెలిపాడు.
పహల్గామ్ ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన 26 మంది పర్యాటకుల పట్ల షోయబ్ రెహ్మాన్ ఎటువంటి సానుభూతి వ్యక్తం చేయకపోవడం గమనార్హం. కానీ, భారతదేశంతోపాటు సైన్యానికి వ్యతిరేకంగా ఆయన తన అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తం చేసిన విధానం, ఉగ్రవాదులను సమర్థిస్తున్నారని ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే, ఆయన తన మొత్తం స్పీచ్‌లో ఉగ్రవాదులకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది కోట్లాది మంది భారతీయులకు ఆశ్చర్యం కలిగిస్తుంది.
ఈ దాడికి పాకిస్తాన్ కారణమంటూ ఆరోపించిన డానిష్ కనేరియా..
పహల్గామ్‌లో జరిగిన ఈ దాడి తర్వాత భారత ప్రభుత్వం, భారత భద్రతా దళాలు రెండూ అప్రమత్తంగా ఉన్నాయి. భారత సైన్యం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదుల ఇళ్లను కూల్చివేస్తున్నారు. ఈ సంఘటన తర్వాత, పాకిస్తాన్ మాజీ క్రికెట్ జట్టు ఆటగాడు డానిష్ కనేరియా తన సొంత దేశ ప్రభుత్వ ఉద్దేశాలను ప్రశ్నించాడు. అతను సోషల్ మీడియాలో, “పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాకిస్తాన్ పాత్ర నిజంగా లేకపోతే, ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ ఇంకా ఎందుకు ఖండించలేదు? సైన్యం అకస్మాత్తుగా ఎందుకు అప్రమత్తంగా ఉంది? ఎందుకంటే, మీకు నిజం తెలుసు – మీరు ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ, వారిని పెంచుతున్నారు. మీరు సిగ్గుపడాలి” అంటూ తన సొంత దేశంపైనే విమర్శలు గుప్పించాడు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియో..
The responsibility for the terrorist incident in Pahalgam entirely on Indian security forces, nine lakh soldiers are deployed there.@awaztvofficial @iamsurajkp#Pahalgam #pahalgamattack #PahalgamTerrorAttack #PSL2025 #PSL #PSLX #IPL2025 #Shuaibrehman #شعیب_رحمن #Cafecricket pic.twitter.com/3D4LFxfPlO
— Shuaib Rehman (@SMRehmaan) April 24, 2025
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




