Yuvraj Singh: టీమిండియాలోకి యువరాజ్ రీఎంట్రీ .. ఐసీసీ టైటిల్‌ కోసం ఏం చేయాలో చెప్పిన సిక్సర్ల కింగ్‌

2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు డ్యాషింగ్‌ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. భారత క్రికెట్‌లో లెజెండరీగా గుర్తింపు పొందిన యువీ క్రికెట్ కు వీడ్కోలు పలికి చాలా ఏళ్లు గడిచాయి. కాగా, టీమిండియా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మళ్లీ జట్టులోకి రావాలనే కోరికను సిక్సర్ల రారాజు యువరాజ్ వ్యక్తం చేశాడు

Yuvraj Singh: టీమిండియాలోకి యువరాజ్ రీఎంట్రీ .. ఐసీసీ టైటిల్‌ కోసం ఏం చేయాలో చెప్పిన సిక్సర్ల కింగ్‌
Yuvraj Singh

Updated on: Jan 14, 2024 | 5:01 PM

2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్ గెలవడంలో ప్రధాన పాత్ర పోషించాడు డ్యాషింగ్‌ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్. భారత క్రికెట్‌లో లెజెండరీగా గుర్తింపు పొందిన యువీ క్రికెట్ కు వీడ్కోలు పలికి చాలా ఏళ్లు గడిచాయి. కాగా, టీమిండియా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మళ్లీ జట్టులోకి రావాలనే కోరికను సిక్సర్ల రారాజు యువరాజ్ వ్యక్తం చేశాడు. అయితే ప్లేయర్ గా కాదు.. టీమిండియా మెంటార్‌గా. యువరాజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవంలో యువరాజ్ సింగ్ ఈ విషయంపై మాట్లాడాడు. గత కొన్నేళ్లుగా టీమ్ ఇండియా ప్రదర్శన, అలాగే ICC ఈవెంట్‌ల ఫైనల్స్‌లో భారత జట్టు ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చివరి దశలో జట్టు తడబడడానికి కారణాన్ని కూడా యువరాజ్‌ వెల్లడించాడు. ‘గత కొన్నేళ్లుగా మనం (టీమ్ ఇండియా) అనేక ఐసిసి ఈవెంట్లలో ఫైనల్స్‌లో ఆడాము, కానీ ఒక్కటి కూడా గెలవలేకపోయాం. 2017లో పాకిస్థాన్ చేతి’లో ఓడిపోయిన ఫైనల్‌లో నేను భాగమయ్యాను. రాబోయే సంవత్సరాల్లో మనం ఖచ్చితంగా ఈ సమస్యను అధిగమించాల్సి ఉంటుంది. ఒక దేశంగా, భారత జట్టుగా, మనం ఎంతో ఒత్తిడి మధ్య మెరుగైన ప్రదర్శన చేయాలి. ఏదో తప్పు జరిగిందని నేను అనుకుంటున్నాను, పెద్ద మ్యాచ్ ఉన్నప్పుడు మనం శారీరకంగా సిద్ధంగా ఉంటాము కానీ మానసికంగా కూడా మనం బలంగా ఉండాలి. అప్పుడే మనం విజయం సాధిస్తాం’

యువ ఆటగాళ్లను ప్రోత్సహించడం, ఒత్తిడిని ఎలా ఎదుర్కోవవడం, వారి ఆటను ఎలా మెరుగుపరచాలో నేర్పడం చాలా ముఖ్యం అని నేను భావిస్తున్నాను. ఇదో సవాల్‌గా మారింది. మ్యాచ్‌ల్లో, ఒత్తిడిలో బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు మన దగ్గర ఉన్నారు కానీ జట్టు మొత్తం చేయాల్సి ఉంటుంది, ఇలా ఒకరిద్దరు ఆటగాళ్లు రాణిస్తే సరిపోదు. కాబట్టి జట్టు భవిష్యత్తు దృష్ట్యా టీమ్ ఇండియాకు మార్గనిర్దేశం చేయాలనుకుంటున్నాను. రాబోయే సంవత్సరాల్లో మళ్లీ క్రికెట్‌లోకి రావాలనుకుంటున్నాను. యువ ఆటగాళ్లకు సాయం చేసేందుకు ప్రయత్నిస్తాను. పెద్ద టోర్నీల్లో మనం చాలా మానసిక సవాళ్లను ఎదుర్కొంటామని నేను భావిస్తున్నాను. మానసిక కోణంలో నేను భవిష్యత్తులో ఈ ఆటగాళ్లతో కలిసి పని చేయగలనని నమ్ముతున్నాను. ముఖ్యంగా మిడిల్ ఆర్డర్‌లో నేను సహకారం అందించగలనని అనుకుంటున్నాను’ అని యువీ అన్నాడు.

ఇవి కూడా చదవండి

మానసికంగా సిద్ధమవ్వాలి..

భారత్ చివరిసారిగా 2013లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీం ఇండియా ఐసీసీ టైటిల్‌ను గెలవలేదు. 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్ ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో 11 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ భారత్ చివరిసారిగా 2013లో మహేంద్ర సింగ్ ధోనీ నేతృత్వంలో చాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీం ఇండియా ఐసీసీ టైటిల్‌ను గెలవలేదు. 2023 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్ ఇటీవల ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. దీంతో 11 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ టీమ్ ఇండియాకు కలగానే మిగిలిపోయింది.

11 ఏళ్లుగా నెరవేరని కల..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..