AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB vs DC: ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర.. ట్రావిస్ హెడ్ రికార్డును బద్దలు కొట్టిన ఆర్సీబీ స్టార్..!

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విధ్వంసకర ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్ ఐపీఎల్ చరిత్రలో అరుదైన ఘనత సాధించాడు. చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో శనివారం (ఏప్రిల్ పద్దెనిమిది) జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ రికార్డును బద్దలు కొట్టిన డేవిడ్.. లీగ్‌లో ఎదుర్కొన్న బంతుల పరంగా అత్యంత వేగంగా వెయ్యి పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా నిలిచి సరికొత్త చరిత్ర సృష్టించాడు.

RCB vs DC: ఐపీఎల్‌లో సరికొత్త చరిత్ర.. ట్రావిస్ హెడ్ రికార్డును బద్దలు కొట్టిన ఆర్సీబీ స్టార్..!
Tim David Fastest 1000 Runs
Venkata Chari
|

Updated on: Apr 18, 2026 | 7:00 PM

Share

ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 17 బంతుల్లో 26 పరుగులు చేసిన టిమ్ డేవిడ్ తన ఐపీఎల్ కెరీర్ లో 1000 పరుగుల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 560 బంతుల్లోనే ఈ ఘనత సాధించడం ద్వారా తన దేశానికే చెందిన స్టార్ ఆటగాడు ట్రావిస్ హెడ్ రికార్డును అతడు అధిగమించాడు. ట్రావిస్ హెడ్ ఈ రికార్డును చేరుకోవడానికి 575 బంతులు తీసుకున్నాడు. అయితే, కోల్‌కతా నైట్ రైడర్స్ మాజీ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఇప్పటికీ ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తన విధ్వంసకర బ్యాటింగ్ శైలితో బౌలర్లకు చుక్కలు చూపించే రస్సెల్.. కేవలం 545 బంతుల్లోనే 1000 పరుగుల మార్కును అందుకున్నాడు. ఆర్సీబీ కే చెందిన మరో ఆటగాడు ఫిల్ సాల్ట్ కూడా 575 బంతుల్లో 1000 పరుగులు చేసి ఈ ఎలైట్ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు.

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు చేసిన ఆటగాళ్లు:

545 బంతులు – ఆండ్రీ రస్సెల్

560 బంతులు – టిమ్ డేవిడ్

575 బంతులు – ట్రావిస్ హెడ్

575 బంతులు – ఫిల్ సాల్ట్

594 బంతులు – హెన్రిచ్ క్లాసెన్

604 బంతులు – వీరేంద్ర సెహ్వాగ్

నిరాశపరిచిన ఆర్సీబీ బ్యాటర్లు.. ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్

ఐపీఎల్ రెండు వేల ఇరవై ఆరు సీజన్‌లో అద్భుతమైన ఫామ్ లో ఉన్న డేవిడ్, ఆర్సీబీకి చివర్లో కీలకమైన పరుగులు అందిస్తున్నాడు. అయితే, ఢిల్లీ పై మాత్రం అతడు భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మొదటి పది బంతుల్లో ఇరవై రెండు పరుగులు చేసి ఊపు మీద కనిపించినా, ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో మోసపోయాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమై నటరాజన్ చేతికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరోవైపు బెంగళూరు బ్యాటర్లు కూడా ఆశించిన స్థాయిలో రాణించలేదు. విరాట్ కోహ్లీ త్వరగానే అవుట్ కాగా, ఓపెనర్ ఫిల్ సాల్ట్ అరవై మూడు పరుగులతో మెరుపులు మెరిపించాడు. కానీ, మిడిలార్డర్ వైఫల్యంతో ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట డెబ్భై ఐదు పరుగులు మాత్రమే చేయగలిగింది. మిడిల్ ఓవర్లలో స్పిన్ ద్వయం కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ పొదుపుగా బౌలింగ్ చేసి చెరో రెండు వికెట్లు పడగొట్టగా, డెత్ ఓవర్లలో పేసర్ లుంగీ ఎంగిడి ఆర్సీబీని అద్భుతంగా కట్టడి చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
60 ఏళ్ల వయసులోనూ పొలాల్లో పని చేసిన తాతల బలం పొలం పాయసమే..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
ఇలా ఉన్నారేంట్రా.. అర్థరాత్రి కాలనీల్లో లవ్ బర్డ్స్ హల్చల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
మీరు చేసే ఈ చిన్న పొరపాటుతో మీ ఏసీ పని ఖతం.. కరెంట్ బిల్ డబుల్..
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
కీలక నిర్ణయం.. ఉద్యోగులకు కనీస వేతనాన్ని సవరించిన తెలంగాణ సర్కార్
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. టీమిండియా షెడ్యూల్ చూశారా..!
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
షోలే సినిమా సీన్ రిపీట్.. ప్రేమ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
రిలయన్స్ జియో రూ.189 ప్లాన్.. 28 రోజుల వ్యాలిడిటీ..
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
దీదీ కోటలో మహారాష్ట్ర సీన్.. తృణమూల్ కాంగ్రెస్‌లో చీలిక?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
IPL 2027: వచ్చే ఏడాది వేలంలో రూ. 30 కోట్లు పక్కా.. ఎవరంటే?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?
బాబోయ్ వీరికి చాలా డేంజర్ కాలం రాబోతోంది.. మీరున్నారా?