CSK vs DC: చెన్నైతో మ్యాచ్‌.. డుప్లెసిస్‌ ఎందుకు ఆడటం లేదు? కారణం ఇదే..!

ఢిల్లీ క్యాపిటల్స్ వైస్ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో అనారోగ్యంతో దూరమయ్యాడు. అతని స్థానంలో సమీర్ రిజ్వీ ఆడుతున్నాడు. డుప్లెసిస్ గైర్హాజరీతో కెఎల్ రాహుల్ ఓపెనింగ్ చేశాడు. ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ ఫాఫ్ పూర్తి ఫిట్ గా లేడని తెలిపాడు. టాస్ గెలిచిన ఢిల్లీ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.

CSK vs DC: చెన్నైతో మ్యాచ్‌.. డుప్లెసిస్‌ ఎందుకు ఆడటం లేదు? కారణం ఇదే..!
Faf Du Plessis

Updated on: Apr 05, 2025 | 4:56 PM

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనింగ్‌ బ్యాటర్‌, వైస్‌ కెప్టెన్‌ ఫాఫ్ డు ప్లెసిస్ చెన్నై సూపర్ కింగ్స్‌తో శనివారం మధ్యాహ్నం ప్రారంభమైన మ్యాచ్‌కు దూరమయ్యాడు. డుప్లెసిస్‌ ఆడకపోవడంపై డీసీ కెప్టెన్‌ అక్షర్‌ పటేల్‌ స్పందించాడు. ఫాఫ్‌ పూర్తి స్థాయిలో ఫిట్‌గా లేడని, అతని స్థానంలో సమీర్ రిజ్వీని ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకుంటున్నట్లు అక్షర్ పటేల్ వెల్లడించాడు. కాగా, గత రెండు మ్యాచ్‌ల్లో ఫాఫ్ 79 పరుగులు చేశాడు. అందులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అర్ధ సెంచరీ కూడా ఉంది.

ఇక డుప్లెసిస్‌ దూరం అవ్వడంతో యువ ఓపెనర్‌ జెక్‌ ఫ్రేజర్‌తో కలిసి కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. SRHతో జరిగిన మ్యాచ్‌లో కీపర్ కమ్‌ బ్యాటర్ నాల్గవ స్థానంలో ఆడిన రాహుల్‌.. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా ఆడుతున్నాడు. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో రాహుల్‌ ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించాలని డీసీ మేనేజ్‌మెంట్‌ భావించింది. అయితే, ఫాఫ్ గైర్హాజరితో రాహుల్‌ తప్పక ఓపెనింగ్‌ చేయాల్సి వచ్చింది.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. టాస్ గెలిచి ఢిల్లీ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో పిచ్‌ స్లో అవుతుందని ఆశిస్తున్నానని అక్షర్ వివరించాడు. ఈ సీజన్‌లో వరుస విజయాలతో డ్రెస్సింగ్ రూమ్ చాలా సానుకూలంగా ఉందని అక్షర్‌ పేర్కొన్నాడు. మరోవైపు, రుతురాజ్ గైక్వాడ్ ఈ మ్యాచ్‌కు దూరం అవుతాడని వార్తలు వచ్చినా.. సకాలంలో కోలుకోవడంతో బరిలోకి దిగాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.