Video: 29 పరుగులు.. 2 వికెట్లు.. కట్‌చేస్తే.. దక్షిణాఫ్రికా పాలిట విలన్‌గా మారిన మాజీ ఆటగాడు..
ICC World Cup 2023: దక్షిణాఫ్రికా ప్రారంభంలో 44 పరుగులకే 4 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇందులో విశేషమేమిటంటే.. ఆఫ్రికా తరుపున పడిన 4 వికెట్లలో అతి ముఖ్యమైన 2 వికెట్లు తీయడంలో దక్షిణాఫ్రికా జట్టు మాజీ ఆటగాడు కీలకపాత్ర పోషించాడు.
వన్డే ప్రపంచకప్ (ICC World Cup 2023) లో వరుసగా 2 మ్యాచ్‌లు గెలిచిన దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ (South Africa vs Netherlands)పై ఘోర పరాజయాన్ని చవిచూసింది. నెదర్లాండ్స్‌తో జరిగిన 246 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా జట్టు అనూహ్య ఓటమిని చవిచూసింది. ముఖ్యంగా తొలి రెండు మ్యాచ్ ల్లో బ్యాటింగ్ విభాగంలో అద్భుత ప్రదర్శన కనబర్చిన సౌతాఫ్రికా.. నెదర్లాండ్స్ పై మాత్రం ఘోరంగా విఫలమైంది. దక్షిణాఫ్రికా జట్టు ఆదిలోనే 44 పరుగులకే 4 ముఖ్యమైన వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇందులో విశేషమేమిటంటే.. ఆఫ్రికా తరుపున పడిన 4 వికెట్లలో అతి ముఖ్యమైన 2 వికెట్లు తీయడంలో దక్షిణాఫ్రికా జట్టు మాజీ ఆటగాడు కీలక పాత్ర పోషించాడు.
ప్రారంభంలోనే పతనమైన సౌతాఫ్రికా..
తొలి 10 ఓవర్లలో దక్షిణాఫ్రికా ఆటగాడు క్వింటన్ డి కాక్, కెప్టెన్ టెంబా బావుమా, ఐడాన్ మార్క్‌రామ్, రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్‌లను నెదర్లాండ్స్ బౌలర్లు ఔట్ చేశారు. 246 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించింది. కెప్టెన్ టెంబా బావుమా, క్వింటన్ డి కాక్‌లు ఈసారి పెద్ద భాగస్వామ్యాన్ని నెలకొల్పలేకపోయారు. తొలి రెండు మ్యాచ్ ల్లో సెంచరీ బాదిన క్వింటన్ డి కాక్.. వరల్డ్ కప్ లో హ్యాట్రిక్ సెంచరీ సాధించాలనే ఉద్దేశంతో రంగంలోకి దిగాడు. కానీ, జట్టు స్కోర్ 36 పరుగుల వద్ద ఉన్నప్పుడు డి కాక్ వికెట్ పడిపోయింది.
2 వికెట్లు తీసిన ఆఫ్రికా మాజీ ఆటగాడు..
View this post on Instagram
దక్షిణాఫ్రికా తరుపున తొలుత బ్యాటింగ్ చేసిన కోలిన్ అకర్‌మన్ 20 పరుగుల వద్ద క్వింటన్ డి కాక్ వికెట్ తీశాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. అప్పుడు దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు, ఇప్పుడు నెదర్లాండ్స్‌కు ఆడుతున్న రోలోఫ్ వాన్ డెర్ మెర్వే దక్షిణాఫ్రికాకు రెండవ దెబ్బ ఇచ్చాడు. మెర్వే కెప్టెన్ బావుమాపై వేటాడాడు. 16 పరుగులతో ఆడుతున్న టెంబాను మెర్వే బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత పాల్ వాన్ మీకెరెన్ 1 పరుగు చేసిన ఐడాన్ మర్క్‌రామ్‌ను బౌల్డ్ చేశాడు. ఆపై తన రెండో వికెట్ తీసిన రోలోఫ్ వాన్ డెర్ మెర్వే 4 పరుగులు చేసిన రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్ వికెట్ తీశాడు. దీంతో ఆఫ్రికన్ జట్టు 44 పరుగులకే 4 ముఖ్యమైన వికెట్లు కోల్పోయింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..