11 సిక్స్‌లు, 12 ఫోర్లు.. టీ20లో 153 పరుగులు.. కట్ చేస్తే.. న్యూజిలాండ్ టీంతో జతకట్టిన ఆల్ రౌండర్..

|

May 10, 2022 | 6:40 PM

ఓ టీ20 మ్యాచ్‌లో 153 పరుగులు చేయడంతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. కేవలం 66 బంతుల్లో 11 సిక్స్‌లు, 12 ఫోర్లు బాదేసి సంచలనం నెలకొల్పాడు.

11 సిక్స్‌లు, 12 ఫోర్లు.. టీ20లో 153 పరుగులు.. కట్ చేస్తే.. న్యూజిలాండ్ టీంతో జతకట్టిన ఆల్ రౌండర్..
Luke Wright Joins New Zealand
Follow us on

న్యూజిలాండ్ క్రికెట్(New Zealand Cricket) బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంగ్లాండ్(England) మాజీ ఆల్ రౌండర్ ల్యూక్ రైట్‌(Luke Wright)కు కోచింగ్ స్టాఫ్‌లో చోటు కల్పించింది. దీంతో ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లో ల్యూక్ రైట్ కివీ బ్యాట్స్‌మెన్‌కు సహాయం చేయనున్నాడు. ల్యూక్ రైట్‌తో పాటు, డియోన్ ఇబ్రహీం, డీన్ బ్రౌన్లీ, గ్రేమ్ ఆల్డ్రిడ్జ్ కూడా న్యూజిలాండ్ కోచింగ్ స్టాఫ్‌తో సంబంధం కలిగి ఉన్నారు. ఈ మాజీ క్రికెటర్లందరూ న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్ షేన్ జుర్గెన్సన్, బ్యాటింగ్ కోచ్ ల్యూక్ రోంకీకి సహాయం చేయనున్నారు. బ్రిటన్ వాతావరణాన్ని, పిచ్ పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ల్యూక్ రైట్‌ను జట్టులోకి తీసుకున్నట్లు న్యూజిలాండ్ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ తెలిపారు. ల్యూక్ రైట్ చాలా కాలం పాటు టీ20 ఫార్మాట్‌లో ఆధిపత్యం చెలాయించాడు. మాజీ ససెక్స్ క్రికెటర్ తన తుఫాన్ బ్యాటింగ్, బౌలింగ్‌కు ప్రసిద్ధి చెందాడు.

Also Read: IPL 2022: బట్టలు లేక టవల్ కట్టుకునే హోటల్లో ఉన్న.. షాకింగ్ విషయాలు చెప్పిన వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ రోవ్‌మన్ పావెల్..

ల్యూక్ రైట్ 2014లో ససెక్స్ తరపున ఆడుతున్నప్పుడు టీ20 మ్యాచ్‌లో 153 పరుగులు చేయడంతో వెలుగులోకి వచ్చాడు. ఎసెక్స్‌పై ల్యూక్ 66 బంతుల్లో 11 సిక్స్‌లు, 12 ఫోర్లు బాదేశాడు. టీ20 ప్రపంచ కప్ 2022 సమీపంలో ఉంది. న్యూజిలాండ్ జట్టు దానిని గెలవడానికి సరికొత్త వ్యూహాన్ని సిద్ధం చేసింది. గతేడాది ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్న ఈ జట్టు.. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌పై కన్నేసింది. ఈమేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read: IPL 2022: 12 మ్యాచ్‌లు.. 336 పరుగులు.. కానీ, అదే బలహీనత.. అదే తప్పు.. ఆ భారత ఆటగాడెవరంటే?

IPL 2022: 4 ఓవర్లలో 5 వికెట్లు, ఒక మెయిడీన్, 10 పరుగులు.. మ్యాచ్‌ ఓడినా.. 5 రికార్డుల్లో తిరుగేలేని ‘ముంబై స్పీడ్‌స్టర్’..