IND Vs ENG: ఇదేం అరాచకం మావ.! గిల్‌కి ఎసరుపెట్టిన హార్దిక్ ఫ్రెండ్.. 600 పరుగులు కొట్టినా డమ్మీనే
ఇంగ్లాండ్ మాజీ ప్లేయర్ ఓవైస్ షా.. కెఎల్ రాహుల్ గురించి కీలక ప్రకటన చేశాడు. రాబోయే మ్యాచ్‌లలో పరుగుల పరంగా కెఎల్ రాహుల్.. శుభ్‌మన్ గిల్‌ను మించిపోతాడని సంచలన కామెంట్స్ చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

ఇంగ్లాండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతోంది టీమిండియా. ఈ సిరీస్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ రాణించగా.. టీమిండియా బ్యాటింగ్‌కు వీరే పిల్లర్స్. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ ఓవైస్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే మ్యాచ్‌లలో రాహుల్ పరుగుల వరద పారిస్తాడని.. గిల్‌ను దాటేస్తాడని జోస్యం చెప్పాడు. ‘రాహుల్ ఇప్పటికీ కోహ్లీ నీడలోనే ఉన్నాడు. రాహుల్, కోహ్లీ బ్యాటింగ్ చేసేటప్పుడు.. అందరికీ కోహ్లీనే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్. అప్పుడూ రాహుల్‌ను విస్మరించారు. ఇప్పుడూ అదే తీరు.
ఓ పాడ్‌కాస్ట్‌లో ఓవైస్ షా మాట్లాడుతూ.. అటు ఫ్యాన్స్.. ఇటు టీమిండియా.. ఇప్పటిదాకా రాహుల్‌ను విస్మరించారు. అయితే కోహ్లీ రిటైర్మెంట్‌తో రాహుల్‌కు ఇప్పుడు పేరు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. విరాట్ కోహ్లీ లేకుండా ఇది మొదటి సిరీస్. అవును! శుభ్‌మన్ గిల్ చాలా బాగా రాణించాడు. అయితే అతడు ఎక్కువకాలం ఈ ఫామ్ కొనసాగించలేడు. భారత బ్యాటింగ్ లైనప్‌లో రాహుల్ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్. అతని టెక్నిక్ కూడా అద్భుతమైనది. 10 నుంచి 15 మ్యాచ్‌ల తర్వాత కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్‌ను అధిగమిస్తాడని భావిస్తున్నాను. రాబోయే 12 నెలల్లో మనం దీనిని ఆశించవచ్చునని అన్నారు.
శుభ్‌మన్ గిల్ గురించి చెప్పాలంటే.. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతను మూడు మ్యాచ్‌ల్లో 101.17 సగటుతో 607 పరుగులు చేశాడు. టెస్ట్ సిరీస్‌లో గిల్ రెండు సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ సాధించాడు. కెఎల్ రాహుల్ మూడు మ్యాచ్‌ల్లో 62.50 సగటుతో 375 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్‌తో ఇంకా రెండు టెస్టు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఈ ఇద్దరు ఆటగాళ్లు మరిన్ని పెద్ద స్కోర్లు చేయవచ్చునని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








