Video: డ్యాన్స్ మాస్టర్‌గా మారిన టీమిండియా క్రికెటర్..! టీమ్‌లోని మిగిలిన ప్లేయర్లకు క్లాసులు..
టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తన సహచరుడు కుల్దీప్ యాదవ్‌కు పంజాబీ డ్యాన్స్ నేర్పుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో విశ్రాంతి తీసుకుంటున్న ఆటగాళ్లు ఈ విధంగా సరదాగా గడుపుతున్నారు. అర్ష్‌దీప్, కుల్దీప్ కు ఈ టెస్ట్ సిరీస్లో ఆడే ఛాన్స్ రాలేదు.

టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ డ్యాన్స్ మాస్టర్ అవతారం ఎత్తాడు. తన సహచరుడు కుల్దీప్ యాదవ్‌కు డ్యాన్స్ క్లాసులు చెబుతున్నాడు. అర్ష్‌దీప్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పంజాబీ డ్యాన్స్ మూవ్ చేస్తూ.. సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో కుల్దీప్ డ్యాన్స్‌ను కాపీ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో చూడొచ్చు. డ్యాన్స్ క్లాస్ త్వరలో ప్రారంభమవుతుందని అర్ష్‌దీప్ క్యాప్షన్‌లో సరదాగా పేర్కొన్నాడు. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆ దేశంలో పర్యటిస్తున్న భారత జట్టు.. ఇప్పటికే 3 టెస్టులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 1-2తో వెనుకబడి ఉంది. ఇక నాలుగో టెస్టుకు కావాల్సినంత సమయం దొరకడంతో ఆటగాళ్లు ఈ సరదాగా చిల్ అవుతున్నారు.
కాగా అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్‌కు ఇప్పటి వరకు జరిగిన మూడు టెస్టుల్లో కూడా ఆడే అవకాశం రాలేదు. మిగిలిన రెండు టెస్టుల్లోనైనా ఆడే ఛాన్స్ ఉంటుందా? అంటే కష్టమనే చెప్పాలి. ప్రస్తుతం మంచి ప్రదర్శన చేస్తున్న ఆటగాళ్లను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించే ఛాన్స్ లేదు. వాళ్లు గాయాలతో తప్పుకుంటే తప్పా.. ఇప్పట్లో ఈ స్టార్ ప్లేయర్లకు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. కాగా 2017లో కుల్దీప్ అరంగేట్రం చేసినప్పటి నుండి 13 టెస్టులు ఆడాడు. మరోవైపు అర్ష్‌దీప్ తన తొలి టెస్ట్ మ్యాచ్ ఆడటానికి వేచి ఉన్నాడు. ఈ సిరీస్‌కు ఎంపికైనప్పటికీ అతనికి ఆడే అవకాశం రాలేదు.
మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో తమ తొలి టెస్ట్ మ్యాచ్‌ను గెలవాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. అయితే అంత సులువైన విషయం అయితే కాదు. ఈ మ్యాచ్ గెలిస్తే ఐదు మ్యాచ్‌ల సిరీస్ 2-2తో సమం అవుతుంది. ఈ స్థానంలో జట్టు గత రికార్డు అంత బాగా లేదు. 1936 నుండి తొమ్మిది టెస్ట్‌లలో ఐదు డ్రాలు, నాలుగు సార్లు ఓడిపోయారు. మాంచెస్టర్‌లో వాతావరణం తేమగా ఉంటుంది. ఇది ఆటను ప్రభావితం చేస్తుంది. ఈ వాతావరణ పరిస్థితులు టీమిండియాకు ప్రతికూలంగా, ఇంగ్లాండ్‌కు అనుకూలంగా ఉంటాయి.
View this post on Instagram
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




