Video: ముల్తాన్ టెస్టులో రచ్చ.. బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే క్యాచ్.. సంబరాల్లో ఇంగ్లండ్ టీం.. కట్‌చేస్తే.. ఊహించని షాక్

Salman Agha Catch Controversy: పాకిస్థాన్‌తో ఏ మ్యాచ్‌ జరిగినా.. అందులో వివాదం రాకుండా ఎలా ఉంటుంది? అన్నట్లు తయారైంది పరిస్థితి. తాజాగా ముల్తాన్ టెస్ట్‌లో కూడా అలాంటిదే కనిపించింది. ముల్తాన్ టెస్టు రెండో రోజు సల్మాన్ ఆగా కొట్టిన షాట్ తీవ్ర దుమారం రేగింది. నిజానికి జాక్ లీచ్ వేసిన బంతికి సల్మాన్ అఘా గాలిలో షాట్ ఆడింది. లాంగ్ ఆఫ్ బౌండరీ వద్ద వోక్స్ క్యాచ్ పట్టి సంబరాలు ప్రారంభించాడు.

Video: ముల్తాన్ టెస్టులో రచ్చ.. బౌండరీ లైన్‌లో కళ్లు చెదిరే క్యాచ్.. సంబరాల్లో ఇంగ్లండ్ టీం.. కట్‌చేస్తే.. ఊహించని షాక్
Salman Agha Catch Controver
Follow us

|

Updated on: Oct 08, 2024 | 4:49 PM

Salman Agha Catch Controversy: పాకిస్థాన్‌తో ఏ మ్యాచ్‌ జరిగినా.. అందులో వివాదం రాకుండా ఎలా ఉంటుంది? అన్నట్లు తయారైంది పరిస్థితి. తాజాగా ముల్తాన్ టెస్ట్‌లో కూడా అలాంటిదే కనిపించింది. ముల్తాన్ టెస్టు రెండో రోజు సల్మాన్ ఆగా కొట్టిన షాట్ తీవ్ర దుమారం రేగింది. నిజానికి జాక్ లీచ్ వేసిన బంతికి సల్మాన్ అఘా గాలిలో షాట్ ఆడింది. లాంగ్ ఆఫ్ బౌండరీ వద్ద వోక్స్ క్యాచ్ పట్టి సంబరాలు ప్రారంభించాడు. అయితే ఆ తర్వాత, థర్డ్ అంపైర్ రీప్లే చూసినప్పుడు, అతను ఈ క్యాచ్‌ను చట్టవిరుద్ధంగా ప్రకటించడం గమనార్హం. సల్మాన్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు. దీంతో పాకిస్తాన్ 6 పరుగులు చేసింది. థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఇంగ్లండ్ జట్టు తీవ్ర అసంతృప్తితో ఉంది.

ముల్తాన్ టెస్టులో రచ్చ..

పాకిస్థాన్ స్కోరు 420 పరుగుల వద్ద ఉన్నప్పుడు, 117వ ఓవర్లో జాక్ లీచ్ వేసిన బంతికి సల్మాన్ అఘా పెద్ద ఏరియల్ షాట్ ఆడాడు. బంతి బౌండరీ దాటుతుండగా క్రిస్ వోక్స్ క్యాచ్ పట్టాడు. ఈ క్యాచ్ తీసుకునే ముందు, వోక్స్ బౌండరీ వెలుపలికి వెళ్లి, ఆపై అతను బంతిని విసిరాడు. చివరికి అతను గాలిలో దూకి క్యాచ్ తీసుకున్నాడు. రీప్లేలో వోక్స్ క్యాచ్ తీసుకున్నట్లు అనిపించింది. అయితే, థర్డ్ అంపైర్ క్రిస్ గాఫ్నీ ప్రకారం, బంతిని క్యాచ్ చేస్తున్నప్పుడు వోక్స్ పాదం బౌండరీకి తాకింది. అందుకే అతను సల్మాన్ అఘా నాటౌట్‌గా ప్రకటించాడు.

556కు పాక్ ఆలౌట్..

అయితే ముల్తాన్ టెస్టులో పాకిస్థాన్ జట్టు సత్తా చాటుతోంది. దీంతో జట్టు స్కోరు 500 దాటింది. తొలి రోజు కెప్టెన్ షాన్ మసూద్ 151 పరుగులతో అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. అబ్దుల్లా షఫీక్ కూడా 102 పరుగులు చేశాడు. సౌద్ షకీల్ 82 పరుగులు చేశాడు. వార్త రాసే సమయానికి ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. ఇంగ్లండ్ జట్టు 4 పరుగుల వద్ద ఓలిపోప్ (0) పెవిలియన్ చేరాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..