‘అందరం ఒకటే చెప్పాలి.. మన టీవీ రిపేర్‌లో ఉంది.. మ్యాచ్‌ చూడలేదంతే’: టీమిండియా ఓటమితో పేలుతోన్న జోక్స్..

|

Nov 10, 2022 | 6:38 PM

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022 రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ చేతిలో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ ఓటమితో అభిమానులు రోహిత్ శర్మను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

అందరం ఒకటే చెప్పాలి.. మన టీవీ రిపేర్‌లో ఉంది.. మ్యాచ్‌ చూడలేదంతే: టీమిండియా ఓటమితో పేలుతోన్న జోక్స్..
India Vs England Trolls
Follow us on

టీ20 ప్రపంచకప్ 2022 రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్ టీం భారత అభిమానుల ఆశలపై నీళ్లు చల్లి ఘోర ఓటమిని అందించింది. దీంతో టీమ్ ఇండియా ప్రపంచ కప్ ప్రయాణం ముగిసింది. ఇంగ్లండ్‌ ఓపెనర్‌ అలెక్స్‌ హేల్స్‌, కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ సెంచరీ భాగస్వామ్యం కారణంగా భారత్‌ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఓపెనింగ్ జోడీ పూర్తిగా విఫలమైంది. విరాట్, హార్దిక్‌ల అర్ధ సెంచరీల కారణంగా టీమిండియా 168 పరుగులు చేయగలిగింది.

దీనికి సమాధానంగా, ఇంగ్లండ్ జట్టు ముందు భారత జట్టు బౌలింగ్ పూర్తిగా విఫలమైంది. ఫలితంగా నాలుగు ఓవర్లు మిగిలి ఉండగానే భారత్ ఓడిపోయింది. దీంతో అభిమానులు సోషల్ మీడియాలో భారత ఆటగాళ్లపై ఫైర్ అవుతున్నారు. అలాగే జోక్స్ పేల్చుతూ, ట్రోలింగ్ చేస్తున్నారు. ఈమేరకు #INDvsENG ట్యాగ్ ట్రెండింగ్‌లో నడుస్తోంది. కేఎల్ రాహుల్‌ను వెంటనే జట్టు నుంచి తప్పించాలని అభిమానులు డిమాండ్ చేయగా, చాహల్ లాంటి తెలివైన బౌలర్‌ను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లినా.. ఉపయోగించుకోలేని అమాయకత్వంతో ఉన్నారా అంటూ చాలామంది ప్రశ్నించారు. అంతే కాకుండా మీమ్స్ షేర్ చేస్తూ టీమ్ ఇండియాను ట్రోల్ చేస్తున్నారు. అలాంటి వాటిలో కొన్నింటిని ఇప్పుడుచూద్దాం..

ఇవి కూడా చదవండి

“బాగా గుర్తుంచుకొండి, ఎవ్వరు అడిగినా ఒకేలా చెప్పాలి…. ‘‘మన టీవీ రిపేరులో ఉంది, అందుకే మనం క్రికెట్ మ్యాచ్ చూడలేకపోయాం, డీటీహెచ్ కనెక్షన్ ఉండేది’’
.
.
‘‘దృశ్యం-3 సినిమాలో ఓ దృశ్యం’’

“ఆ.. ఓడింది రిషి సునాక్ చేతిలోనేగా.. అనుకుంటే.. మనసుకి ప్రశాంతంగా ఉంటుంది ప్రెండ్స్.”

“కటకటా… ఎట్టెట్టా.. ఆ తెల్లతోళ్ల దొరలు మరోసారి భారత్-పాక్ ను విడదీశారు (కొట్టుకోకుండా).”

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..