Moeen Ali: 68 మ్యాచ్‌లు.. 3094 రన్స్..204 వికెట్లు.. రెండోసారి టెస్టు క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసిన ధోని ఫ్రెండ్
ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ మళ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతకుముందు 2021లో అలీ తన టెస్ట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పట్టుబట్టడంతో మళ్లీ యాషెస్ సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్ 2-2తో డ్రా చేసుకుంది ఇంగ్లండ్. సిరీస్ ముగియడంతో మొయిన్ అలీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన యాషెస్ సిరీస్ చివరి మ్యాచ్‌లో మొయిన్ అలీ 3 వికెట్లు తీశాడు
ఇంగ్లండ్ స్టార్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ మళ్లీ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతకుముందు 2021లో అలీ తన టెస్ట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. అయితే ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, కోచ్ బ్రెండన్ మెకల్లమ్ పట్టుబట్టడంతో మళ్లీ యాషెస్ సిరీస్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్ 2-2తో డ్రా చేసుకుంది ఇంగ్లండ్. సిరీస్ ముగియడంతో మొయిన్ అలీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్‌లో జరిగిన యాషెస్ సిరీస్ చివరి మ్యాచ్‌లో మొయిన్ అలీ 3 వికెట్లు తీశాడు. తద్వారా ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సిరీస్ లో నాలుగు టెస్టులు ఆడిన అలీ 9 వికెట్లు తీయడంతోపాటు 180 పరుగులు చేశాడు. ఐదో టెస్టు చివరి రోజు మూడు కీలక వికెట్లు తీసిన మొయిన్ ఇంగ్లండ్‌ను సిరీస్ డ్రా చేసుకోవడంలో కీ రోల్ పోషించాడు. కాగా విజయంతోనే వీడ్కోలు పలకాలని మొయిన్ అలీ ముందుగా నిర్ణయించుకున్నాడు. అందుకు తగ్గట్టుగానే చివరి టెస్టు మ్యాచ్ ఆడిన స్టువర్ట్ బ్రాడ్ తో పాటు మొయిన్ అలీ కూడా పెవిలియన్ వైపు అడుగులు వేశాడు. దీంతో ఇంగ్లండ్ జట్టులోని ఇద్దరు ఆటగాళ్ల టెస్టు కెరీర్ ముగిసింది.
కాగా 2021లో టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మొయిన్ అలీని తిరిగి తీసుకురావడంలో బెన్ స్టోక్స్ కీలక పాత్ర పోషించాడు. అయితే ఇప్పుడు రిటైర్మెంట్ ప్రకటించిన మొయిన్ అలీ తాను టెస్టు క్రికెట్‌కు తిరిగి రాలేనని తేల్చిచెప్పాడు. స్టోక్స్ చేసే మెసేజ్‌లకు సమాధానం ఇవ్వనని నవ్వుతూ ఆన్సర్ ఇచ్చాడు. అలాగే స్టోక్స్ మెసేజ్ చేస్తే దాన్ని డిలీట్ చేస్తానన్నాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని అలీ క్లారిటీ ఇచ్చాడు. కాగా రెడ్ బాల్ క్రికెట్‌లో ఇంగ్లండ్ తరఫున 68 టెస్టు మ్యాచ్‌లు ఆడిన మొయిన్ అలీ 5 సెంచరీలు, 15 అర్ధసెంచరీలతో 3094 పరుగులు చేశాడు. అలాగే 204 వికెట్లు తీశాడు. ఇక మొయిన్ అలీ ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తోన్న సంగతి తెలిసిందే.
Stuart Broad and Moeen Ali strolling off into the sunset together 🤩
The Oval waves goodbye to two England greats 💔 pic.twitter.com/7SlGMCADOB
— Mail Sport (@MailSport) July 31, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..