- Telugu News Photo Gallery Cricket photos WI vs IND 3rd ODI Ishan Kishan Breaks MS Dhoni's Elite Record 50+ in each match of a 3 ODI bilateral series
IND Vs WI: ధోనీ ప్రత్యేక రికార్డును బ్రేక్ చేసిన డబుల్ సెంచరీ ప్లేయర్.. ఏకంగా దిగ్గజాల సరసన చోటు..
Ishan Kishan Records: ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న 3వ వన్డే మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ హాఫ్ సెంచరీతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేక రికార్డును బద్దలు కొట్టాడు. ఇషాన్ కిషన్ 64 బంతుల్లో 3 సిక్సర్లు, 8 ఫోర్లతో 77 పరుగులు చేశాడు. దీంతో వన్డే సిరీస్‌లో వరుసగా అర్ధశతకాలు సాధించిన 6వ భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.
Updated on: Aug 01, 2023 | 10:25 PM

India Vs West Indies: ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా క్రికెట్ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరుగుతున్న 3వ వన్డే మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీ చేశాడు. ఈ హాఫ్ సెంచరీతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ప్రత్యేక రికార్డును బద్దలు కొట్టాడు.

ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా రంగంలోకి దిగిన ఇషాన్ కిషన్ 64 బంతుల్లో 3 సిక్సర్లు, 8 ఫోర్లతో 77 పరుగులు చేశాడు. దీంతో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో వరుసగా మూడు అర్ధశతకాలు సాధించిన 6వ భారత బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

అలాగే ఈ ఘనత సాధించిన టీమిండియా రెండో వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇంతకు ముందు మాజీ వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ఇలాంటి ప్రత్యేక రికార్డు సృష్టించాడు.

2019లో ఆస్ట్రేలియాతో జరిగిన 3-మ్యాచ్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్ ధోని హ్యాట్రిక్ హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇప్పుడు ధోనీ పేరిట ఉన్న ఈ ప్రత్యేక రికార్డును ఇషాన్ కిషన్ సమం చేశాడు.

అంతకుముందు వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో ఇషాన్ కిషన్ 52, రెండో వన్డేలో 55 పరుగులు చేశాడు. ఇప్పుడు, మూడో ODI మ్యాచ్‌లో 77 పరుగులతో సత్తా చాటి, ప్రపంచ కప్ టీంలో తన స్థానాన్ని బలపరుచుకున్నాడు. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో హ్యాట్రిక్ హాఫ్ సెంచరీ సాధించిన భారత 2వ వికెట్ కీపర్‌గా, ఈ ఘనత సాధించిన టీమిండియా 6వ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

గతంలో క్రిస్ శ్రీకాంత్ (1982), దిలీప్ వెంగ్‌సర్కార్ (1985), మహ్మద్ అజారుద్దీన్ (1993), ఎంఎస్ ధోని (2019), శ్రేయాస్ అయ్యర్ (2020) 3 మ్యాచ్‌ల సిరీస్‌లో హ్యాట్రిక్ అర్ధశతకాల రికార్డును లిఖించారు. ఇప్పుడు ఈ ఘనత సాధించిన 6వ భారత ఆటగాడిగా ఇషాన్ కిషన్ నిలిచాడు.




