AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్‌ రా బాబు! ఇప్పటికైనా నమ్మండి.. లేదా ఇది చూడండి!

ఐపీఎల్ 2024లో ధోని అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్‌ను అద్భుతమైన స్టంపింగ్‌తో అవుట్ చేశాడు. అంతేకాకుండా, డీఆర్‌ఎస్‌ను సమర్థంగా ఉపయోగించి సాంట్నర్‌ను అవుట్ చేయించాడు. ధోని యొక్క వేగం, అనుభవం, మేధస్సు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఆయన ఐపీఎల్‌లో మళ్ళీ తన ప్రభావాన్ని చూపిస్తున్నాడు.

DRS అంటే ధోని రివ్యూ సిస్టమ్‌ రా బాబు! ఇప్పటికైనా నమ్మండి.. లేదా ఇది చూడండి!
Dhoni Drs
SN Pasha
|

Updated on: Mar 24, 2025 | 8:32 AM

Share

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని చాలా కాలం తర్వాత మళ్లీ తిరిగి గ్రౌండ్‌లోకి అడుగుపెట్టాడు. ఐపీఎల్‌ 2024 తర్వాత.. మళ్లీ ఐపీఎల్‌ 2025లో భాగంగా ఆదివారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయి చాలా కాలం అవుతున్నా.. కేవలం తన అభిమానుల కోసం ధోని ఐపీఎల్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. కొన్ని సార్లు తన శరీరం సహకరించకున్నా.. ధోని మ్యాచ్‌లు ఆడుతున్నాడు. గత ఐపీఎల్‌ సీజన్లో అలాంటి సీన్లు చూశాం. కానీ, ఈ సీజన్‌లో ధోని ఫుల్‌ ఫిట్‌గా ఉన్నట్లు తెలుస్తోంది.

ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రెప్పపాటు వేగంతో ఒక స్టంపింగ్‌ చేశాడు. డేంజరస్‌ బ్యాటర్‌, ముంబై ఇండియన్స్ కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ను అవుట్‌ చేశాడు. అది చూసి.. చాలా మంది వావ్‌.. వింటేజ్‌ ధోనిని చూసినట్లు ఉందని అంటున్నారు. ఆ స్టింపింగ్‌ చూసి ఫిదా అయిపోయిన ఫ్యాన్స్‌ మరో ట్రీట్‌ ఇచ్చాడు తలా. ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌లో సీఎస్‌కే బౌలర్‌ నాథన్‌ ఎల్లిస్‌ వేసిన బాల్‌ ముంబై బ్యాటర్‌ సాంట్నర్‌ ప్యాడ్లకు తాకింది. నాథన్‌ అప్పీల్‌ చేయగా.. అంపైర్‌ నాటౌట్‌ అంటూ తలను అడ్డంగా ఊపాడు. దీంతో నాథన్‌.. వెంటనే వికెట్‌ కీపర్‌గా ఉన్న ధోని కేసి చూస్తూ.. బాల్‌ కాస్త హైట్‌ ఉందా అని అడిగాడు.

అయితే.. ధోని వెంటనే రివ్యూకు వెళ్లాల్సిందిగా రుతురాజ్‌ గైక్వాడ్‌కు సూచించాడు. ధోని చెప్పిన తర్వాత రుతురాజ్‌ కాదంటాడా.. ఇమీడియట్‌గా రివ్యూ తీసుకున్నాడు. రీప్లేలో చూస్తే.. సాంట్నర్‌ వికెట్ల ముందు దొరికిపోయాడు. చేసేదేం లేక ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయం మార్చుకుంటూ.. సాంట్నర్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో మరోసారి డీఆర్‌ఎస్‌ అంటూ డిసిషన్‌ రివ్యూ సిస్టమ్‌ కాదని, ఇది ధోని రివ్యూ సిస్టమ్‌ అంటూ సీఎస్‌కే అభిమానులు సోషల్‌ మీడియాను ఊపేస్తున్నారు. గతంలో కూడా చాలా సార్లు ధోని తీసుకున్న రివ్యూలు పాజిటివ్‌ ఫలితాలను ఇచ్చాయి. అందుకే చాలా మంది సరదాగా డీఆర్‌ఎస్‌ అంటే ధోని రివ్యూ సిస్టమ్‌ అంటూ ఉంటారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..