AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: రోజుకు 20 యాడ్స్, ఏడాదికి రూ.100కోట్లుపైగానే.. టీమిండియా మాజీ ప్లేయర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

మాజీ కోచ్ రవిశాస్త్రి, ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి భారత క్రికెట్ దిగ్గజాలు ఏడాదికి రూ.100 కోట్లకు పైగా సంపాదిస్తారని సంచలన విషయాలు వెల్లడించారు. భారత క్రికెటర్లు మైదానంలోనే కాకుండా మైదానం వెలుపల కూడా ఎంత సంపాదిస్తున్నారో రవిశాస్త్రి చెప్పిన మాటలు ఆశ్చర్యపరిచాయి.

Team India: రోజుకు 20 యాడ్స్, ఏడాదికి రూ.100కోట్లుపైగానే.. టీమిండియా మాజీ ప్లేయర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Ms Dhoni Virat Kohli
Rakesh
| Edited By: Venkata Chari|

Updated on: Jul 26, 2025 | 3:03 PM

Share

Ravi Shastri : భారత మాజీ కోచ్ రవిశాస్త్రి భారత క్రికెట్ దిగ్గజాల సంపాదన గురించి సంచలన విషయాలు వెల్లడించారు. మాజీ ఇంగ్లాండ్ ఆటగాళ్లు మైఖేల్ వాఘన్, అలిస్టర్ కుక్ , ఫిల్ టఫ్నెల్, డేవిడ్ లాయిడ్ హోస్ట్ చేసిన స్టిక్ టు క్రికెట్ అనే పోడ్‌కాస్ట్‌లో రవిశాస్త్రి మాట్లాడుతూ ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి దిగ్గజ ఆటగాళ్లు తమ పీక్ టైమ్‌లో ముఖ్యంగా ఎండార్స్‌మెంట్ల ద్వారా ఏడాదికి రూ.100 కోట్లకు పైగా సంపాదించారని తెలిపారు. రవిశాస్త్రి మాట్లాడుతూ.. భారత అగ్రశ్రేణి క్రికెటర్లు మైదానం వెలుపల కూడా తమ పాపులారిటీ సాయంతో భారీ ఆదాయాన్ని పొందుతారని చెప్పారు. “ఎండార్స్‌మెంట్ల ద్వారా వాళ్లు పెద్ద మొత్తంలో సంపాదిస్తారు. నేను రూ.100 కోట్లకు పైగా అంటే 10 మిలియన్ డాలర్లకు పైనే అంటాను. మీరే లెక్కించుకోండి” అని రవిశాస్త్రి అన్నారు.

భారత క్రికెటర్లు తమ పీక్ టైమ్‌లో ఒకే రోజులో 20 యాడ్ షూట్‌లలో పాల్గొనగలరని అన్నారు. “ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ వంటి వారు తమ పీక్ టైమ్‌లో 15-20 యాడ్‌లకు పైగా చేసేవారు. అది ఒక రోజులోనే. వారికి సమయం దొరకదు. క్రికెట్ ఆడుతున్నందున వారు ఇంకా ఎక్కువ యాడ్స్ చేయగలరు. కాబట్టి, వారు ఒక సంవత్సరానికి సంబంధించిన యాడ్‌ను ఒకే రోజులో షూట్ చేసి ఇచ్చేవారు” అని ఆయన వెల్లడించారు. మ్యాచ్ ఫీజులు, సెంట్రల్ కాంట్రాక్టుల ద్వారా ఆదాయం వస్తుండగా, రవిశాస్త్రి నిజమైన ఆర్థిక లాభం బ్రాండ్ భాగస్వామ్యాల ద్వారానే వస్తుందని గట్టిగా చెప్పారు. అగ్రశ్రేణి భారత క్రికెటర్ల ఆఫ్-ఫీల్డ్ సంపాదన ఇప్పుడు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో ​​రొనాల్డో వంటి అంతర్జాతీయ క్రీడా సూపర్ స్టార్ల ఆదాయానికి దీటుగా ఉంది.

ఒకవైపు క్రికెటర్ల భారీ సంపాదన గురించి చర్చ జరుగుతుండగా, మరోవైపు ఇంగ్లాండ్ మాంచెస్టర్‌లో జరుగుతున్న అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీపై తమ పట్టును బిగించింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి, ఇంగ్లాండ్ 544/7 పరుగులు చేసి, భారత్ కంటే 186 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇంగ్లాండ్ టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అద్భుతంగా రాణించారు. జో రూట్ 14 బౌండరీలతో కూడిన అద్భుతమైన 150 పరుగులతో ఇన్నింగ్స్‌కు మూలస్తంభంగా నిలిచాడు. ఓపెనర్లు జాక్ క్రాలీ, బెన్ డకెట్ కూడా కీలక పరుగులు చేసి బలమైన పునాది వేశారు. బంతితో తన సత్తా చాటిన బెన్ స్టోక్స్, 77* పరుగులతో భారత్‌కు మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాడు. లియామ్ డాసన్ 21 పరుగులతో నాటౌట్‌గా ఉండి అతనికి సపోర్టుగా నిలుస్తున్నాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..