DC vs MI, IPL 2024: తెలుగోడి మెరుపు ఇన్నింగ్స్ వృథా.. మళ్లీ ఓడిన ముంబై.. ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం

|

Apr 27, 2024 | 7:58 PM

Delhi Capitals vs Mumbai Indians: ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ కు ఏదీ కలిసి రావడం లేదు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఆ జట్టు వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.

DC vs MI, IPL 2024: తెలుగోడి మెరుపు ఇన్నింగ్స్ వృథా.. మళ్లీ ఓడిన ముంబై.. ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టం
Mumbai Indians
Follow us on

Delhi Capitals vs Mumbai Indians: ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ కు ఏదీ కలిసి రావడం లేదు. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఆ జట్టు వరుసగా పరాజయాలు ఎదుర్కొంటోంది. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 258 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 247 పరుగులు మాత్రమే చేసింది. తెలుగబ్బాయి తిలక్‌ వర్మ (32 బంతుల్లో 63, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) చివరి వరకు పోరాడినా ఫలితం లేకపోయింది. ఓపెనర్లు ఇషాన్‌ కిషన్‌ (20), రోహిత్‌ శర్మ (8) నిరాశపరిచారు. ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగిన సూర్యకుమార్‌ యాదవ్‌ (13 బంతుల్లో 26, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్య ( 24 బంతుల్లో 46, 4 ఫోర్లు; 3 సిక్సర్లు), టిమ్‌ డేవిడ్‌ (17 బంతుల్లో 37, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. అయితే లక్ష్యం మరీ ఎక్కువ కావడంతో ముంబై ఇండియన్స్ కు పరాజయం తప్పలేదు. ఈ సీజన్ లో ముంబైకు ఇది ఆరో ఓటమి. దీంతో హార్దిక్ పాండ్యా టీమ్ ప్లే ఆఫ్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.

తిలక్ వర్మ శ్రమ ఇన్నింగ్స్ వృథా..

ఇరు జట్ల ప్లేయింగ్ 11 ఇదే:

ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, కుమార్ కుషాగ్రా, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్, కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, లిజాద్ విలియమ్స్, ముఖేష్ కుమార్, ఖలీల్ అహ్మద్.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

రసిఖ్ దార్ సలామ్, ప్రవీణ్ దూబే, విక్కీ ఓస్త్వాల్, రికీ భుయ్, సుమిత్ కుమార్.

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్(కీపర్), తిలక్ వర్మ, నెహాల్ వధేరా, హార్దిక్ పాండ్యా(కెప్టెన్), టిమ్ డేవిడ్, మహ్మద్ నబీ, పీయూష్ చావ్లా, ల్యూక్ వుడ్, జస్ప్రీత్ బుమ్రా, నువాన్ తుషార.

ఇంపాక్ట్ ప్లేయర్లు:

సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, షామ్స్ ములానీ, డెవాల్డ్ బ్రీవిస్, కుమార్ కార్తికేయ.

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..