
Yashasvi Jaiswal Debut Century: భారత్, వెస్టిండీస్ మధ్య టెస్టు సిరీస్‌లో భాగంగా డొమినికా వేదికగా తొలి మ్యాచ్ జరుగుతోంది. టీమిండియా యువ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ అరంగేట్రం చేస్తున్నాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే సెంచరీ సాధించి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే వరకు 143 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. సెంచరీపై యశస్వి స్పందించాడు. దాన్ని ఎవరికి అంకితం చేశాడో కూడా చెప్పాడు.
సెంచరీ తర్వాత యశస్వి మాట్లాడుతూ.. ‘‘నేను చాలా భావోద్వేగానికి గురయ్యాను. నాకు సహాయం చేసిన వారందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఈ శతకాన్ని నా తల్లిదండ్రులకు అంకితం చేయాలనుకుంటున్నాను. వారి సహకారం చాలా పెద్దది. నేను సుదీర్ఘ ప్రయాణం చేశాను. నేను ఎక్కువగా చెప్పను, సంతోషంగా ఉన్నాను. ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో మరింత మెరుగ్గా పని చేయాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఈ టెస్టు సెంచరీతో యశస్వి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు. అతను కూడా ప్రత్యేక విజయం సాధించాడు. అరంగేట్రం టెస్టులో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుల జాబితాలో అతను నాలుగో స్థానంలో నిలిచాడు. యశస్వి 21 ఏళ్ల 196 రోజుల వయసులో అరంగేట్రం చేశాడు. ఈ విషయంలో పృథ్వీ షా అగ్రస్థానంలో ఉన్నాడు. 18 ఏళ్ల 329 రోజుల వయసులో సెంచరీ సాధించాడు.
A special dedication after a special start in international cricket! 😊#TeamIndia | #WIvIND | @ybj_19 pic.twitter.com/Dsiwln3rwt
— BCCI (@BCCI) July 14, 2023
రెండో రోజు భారత బ్యాటర్లు సత్తా చాటడంతో భారత్ 312 పరుగులు చేసింది. యశస్వి 350 బంతుల్లో 143 పరుగుతో అజేయంగా నిలిచాడు. యశస్వి ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు ఉన్నాయి. 103 పరుగుల వద్ద కెప్టెన్ రోహిత్ శర్మ ఔటయ్యాడు. 221 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. విరాట్ కోహ్లీ 96 బంతుల్లో 36 పరుగులతో అజేయంగా నిలిచాడు. 6 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..