IPL 2025: ప్లేఆఫ్స్ ఎఫెక్ట్.. 25 కోట్ల విలువగల ఆరడజన్ స్టార్ ప్లేయర్లను బొట్టుపెట్టి సాగనంపనున్న CSK!
ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించడంతో, వారు వచ్చే సీజన్ కోసం మార్పులు చేయాలని భావిస్తున్నారు. ఈ సీజన్‌లో చెపాక్‌లో ఐదు ఓటములు, పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉండటం, ఆటగాళ్ల ఫామ్ లేకపోవడం సమస్యలుగా మారాయి. డెవోన్ కాన్వే, అశ్విన్, కరన్ వంటి ఆటగాళ్లను విడుదల చేసి 25 కోట్లు ఆదా చేయాలనే ఆలోచన CSKలో ఉంది. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడం ద్వారా వారు తమ జట్టును కొత్తగా నిర్మించాలనే దిశగా అడుగులు వేస్తున్నారు.

ఐపీఎల్ 2025లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) బుధవారం చెపాక్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓటమిని ఎదుర్కొంది. ఈ ఓటమితో, వారు ప్లేఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించారు. ఈ ఓటమి వారు తమ హోమ్ గ్రౌండ్ అయిన చెపాక్‌లో ఒక సారి కోల్పోయిన అత్యధిక మ్యాచ్‌లుగా నిలిచింది. ఈ సీజన్‌లో చెన్నై చెపాక్‌లో ఐదు మ్యాచ్‌లు కోల్పోయింది, ఇది వారికిది ఒక రికార్డు. అంతేకాకుండా, చెపాక్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌లను ఓడిపోవడం ఇది తొలిసారి. ప్రస్తుతం CSK పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. 10 మ్యాచ్‌లలో కేవలం నాలుగు పాయింట్లు మాత్రమే. వారిని ముంబై ఇండియన్స్ మరియు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో మాత్రమే విజయాలు సాధించారు.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అనే మూడు విభాగాల్లో కూడా వారు ఈ సీజన్‌లో సరైన ఫలితాలు చూపలేదు. ఇప్పటి వరకు సుమారు 20 మంది ఆటగాళ్లను ఉపయోగించడం, వారిలో స్థిరమైన పదకొండుగురిని గుర్తించలేకపోవడాన్ని సూచిస్తుంది. చాలామంది ఆటగాళ్లు ఫామ్‌లో లేకపోవడం కూడా CSKకి నష్టంగా మారింది. మిగిలిన నాలుగు మ్యాచ్‌లు కేవలం ఫార్మాలిటీ మాత్రమే కావడంతో, CSK కొత్త ఆటగాళ్లను ప్రయత్నించవచ్చు. తదుపరి సీజన్ కోసం ప్రణాళికలను మొదలుపెట్టే అవకాశం ఉంది. కానీ, అందరూ వచ్చే భవిష్యత్తులో భాగం కావడం లేదు. అందువల్ల, దిగజారిన ఆటతీరు కారణంగా కొన్ని ప్రముఖ పేర్లను విడుదల చేసే అవకాశం ఉంది.
CSK విడుదల చేయవచ్చని భావిస్తున్న ఆరుగురు ప్రముఖ ఆటగాళ్లు:
1. డెవోన్ కాన్వే.. ధర: ₹6.25 కోట్లు
2023 సీజన్‌లో 672 పరుగులు చేసిన కాన్వే, ఈసారి గాయాల కారణంగా 2024 సీజన్‌ను మిస్ అయ్యాడు. ఈ సీజన్‌లో ఆడిన 3 మ్యాచ్‌ల్లో కేవలం 94 పరుగులు మాత్రమే చేశాడు. ఒక్క 69 పరుగుల ఇన్నింగ్స్ తప్పితే ఇతర మ్యాచ్‌ల్లో తక్కువ ప్రదర్శనతోనే ఉన్నాడు. స్ట్రైక్ రేట్ కూడా 127.02 మాత్రమే. ఈ కారణంగా CSK అతన్ని విడుదల చేయవచ్చనే సూచనలు ఉన్నాయి.
2. జెమీ ఓవర్టన్.. ధర: ₹1.5 కోట్లు
ఆల్‌రౌండర్‌గా తీసుకున్న జెమీ ఓవర్టన్, మూడు మ్యాచ్‌ల్లో ఏ ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. బ్యాటుతో కూడా కేవలం 15 పరుగులు మాత్రమే చేశాడు. ప్రదర్శన దారుణంగా ఉండటంతో CSK అతన్ని వదిలేసే అవకాశం ఉంది.
3. సామ్ కరన్ ధర: ₹2.4 కోట్లు
ఒక మ్యాచ్‌లో 88 పరుగులు చేయడం తప్ప, మిగతా మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 21 పరుగులే చేశాడు. బౌలింగ్‌లో మాత్రం ఒక్క వికెట్ కూడా తీయలేదు. ప్రదర్శన పరంగా తక్కువ స్థాయిలో ఉండటం వల్ల అతను కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.
4. రాహుల్ త్రిపాఠి ధర: ₹3.4 కోట్లు
ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 55 పరుగులే చేయగలిగాడు. స్ట్రైక్ రేట్ 96.49 మాత్రమే. అతని గరిష్ట స్కోరు 23 పరుగులు. ఇది టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌కు సరైన ప్రదర్శన కాదు. దాంతో అతనిని కూడా CSK వదలే అవకాశం ఉంది.
5. దీపక్ హుడా ధర: ₹1.70 కోట్లు
ఐదు మ్యాచ్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. స్ట్రైక్ రేట్ 75.60 మాత్రమే. అతనిని మిడిల్ ఆర్డర్ మరియు లోయర్ మిడిల్ ఆర్డర్‌లో ప్రయోగించినా, ఫలితం లేకుండా పోయింది. అతను కూడా విడుదలయ్యే ఆటగాళ్లలో ఉండవచ్చు.
6. రవిచంద్రన్ అశ్విన్ ధర: ₹9.75 కోట్లు
ఇండియన్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అతని ఫామ్ బాగా తగ్గిపోయింది. ఏడూ మ్యాచ్‌ల్లో కేవలం ఐదు వికెట్లు మాత్రమే తీశాడు. ఎకానమీ రేట్ 9.29. వయసు, ఫిట్‌నెస్, ప్రస్తుత ఫామ్.. కరిగిపోతున్నాయి. అందువల్ల CSK అతన్ని విడుదల చేసి, యువ ఆటగాళ్ల వైపు దృష్టి పెట్టే అవకాశం ఉంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



