IPL 2023 GT Vs CSK Finals: ఉత్కంఠభరిత మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గెలుపు
ఐపీఎల్-16 సీజన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. వర్షం అంతరాయం కలిగించడతో..
ఐపీఎల్-16 సీజన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. వర్షం అంతరాయం కలిగించడతో మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించి చెన్నై లక్ష్యాన్ని 171 పరుగులుగా ఖరారు చేశారు. ఈ లక్ష్యాన్ని చెన్నై చివరి బంతికి ఛేదించింది.
డేవాన్ కాన్వే (47), రహానె (27), రుతురాజ్ గైక్వాడ్ (26), రాయుడు (19) రాణించారు. చివరి ఓవర్ (మోహిత్ శర్మ)లో 13 పరుగులు అవసరం కాగా.. మొదటి నాలుగు బంతుల్లో మూడే పరుగులు రావడంతో చివరి రెండు బంతుల్లో 10 పరుగులుగా మారింది. దీంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కానీ, జడేజా (15) వరుసగా సిక్స్, ఫోర్‌తో చెలరేగిపోవడంతో గెలుపు ఖాయమైపోయింది. దీంతో ఆనందంలో మునిగిపోయారు.