AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌ చేరుకున్న పాకిస్థాన్‌ క్రికెట్ టీమ్‌కు అదిరిపోయే అతిథ్యం.. మెనూలో ఏమున్నాయంటే

హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయిన పాకిస్థాన్‌ ప్లేయర్స్‌కు హైదరాబాద్‌ అసోసియేషన్‌ అధికారులు సాదర స్వాగతం పలికారు. ప్రస్తుతం పాక్‌ ప్లేయర్స్‌ బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్ హోటల్‌లో ఉన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ నుంచి పటిష్ట భద్రత నడుమ ప్లేయర్స్‌ను పార్క్‌ హయత్ హోటల్‌కి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో తమకు లభించిన స్వాగతానికి పాకిస్థాన్‌ క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేశారు....

Hyderabad: హైదరాబాద్‌ చేరుకున్న పాకిస్థాన్‌ క్రికెట్ టీమ్‌కు అదిరిపోయే అతిథ్యం.. మెనూలో ఏమున్నాయంటే
Pakistan Cricket Team
Narender Vaitla
|

Updated on: Sep 28, 2023 | 5:24 PM

Share

దాదాపు ఏడేళ్ల తర్వాత పాకిస్థాన్‌ క్రికెట్ జట్టు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌కు పాకిస్థాన్‌ క్రికెట్ టీమ్‌ చేరుకుంది. బాబార్‌ అజామ్‌ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన ప్లేయర్స్‌ దుబాయ్‌ నుంచి నేరుగా హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయ్యారు. ఇదిలా ఉంటే పాకిస్థాన్‌ హైదరాబాద్‌లో పలు మ్యాచ్‌లు ఆడనున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 29వ తేదీన న్యూజిలాండ్‌తో వన్డే ప్రపంచకప్‌ మొదటి వార్మప్‌ మ్యాచ్‌ను పాక్‌ హైదరాబాద్‌లో ఆడనుంది.

ఇక హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయిన పాకిస్థాన్‌ ప్లేయర్స్‌కు హైదరాబాద్‌ అసోసియేషన్‌ అధికారులు సాదర స్వాగతం పలికారు. ప్రస్తుతం పాక్‌ ప్లేయర్స్‌ బంజారాహిల్స్‌లోని పార్క్‌ హయత్ హోటల్‌లో ఉన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్ నుంచి పటిష్ట భద్రత నడుమ ప్లేయర్స్‌ను పార్క్‌ హయత్ హోటల్‌కి తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే హైదరాబాద్‌లో తమకు లభించిన స్వాగతానికి పాకిస్థాన్‌ క్రికెటర్లు ఆనందం వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షాహీన్‌ షా అఫ్రిది సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. ‘ఇంత వరకు ఎంత గొప్ప సాదర స్వాగతం లభించలేదు’ అనే అర్థం వచ్చేలా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పోస్ట్ చేశాడు.

ఇదిలా ఉంటే పాక్‌ ప్లేయర్స్‌కి అదిరిపోయే ఫుడ్‌ను ఏర్పాటు చేశారు నిర్వాహకులు. హైదరాబాద్‌ బిర్యానీతో పాటు మటన్‌ కర్రీతో స్పెషల్‌ మెనూను ఏర్పాటు చేశారు. వీటితో పాటు గ్రిల్డ్‌ ల్యాంచ్‌ చాప్స్‌, బటర్‌ చికెన్‌, గ్రిల్డ్‌ ఫిష్‌ వంటివి అందించారు. ఇక పాకిస్థాన్‌ ప్లేయర్స్‌ కోసం ప్రత్యేకంగా స్టీమ్‌ చేసిన బాస్మతి రైస్‌, బోలోగ్నీస్‌ సాస్‌తో కూడిన స్పాగెట్టి, వెబ్‌ పులావ్‌ వంటి వాటిని మెనూలో చేర్చారు.

ఇదిలా ఉంటే మరో రెండు వారాల పాటు పాకిస్థాన్‌ క్రికెట్ టీమ్‌ హైదరాబాద్‌లోనే ఉండనుంది. సెప్టెంబర్‌ 29వ తేదీన ఉప్పల్‌ స్టేడియంలో పాకిస్థాన్‌ వామప్‌ మ్యాచ్‌ ఆడనుంది. ఇక అక్టోబర్ 3వ తేదీన ఆస్ట్రేలియాతో మరో వామప్‌ మ్యాచ్‌ను ఆడనుంది. ఈ క్రమంలోనే ఈరోజు (గురువారం) పాక్‌ టీమ్ ప్రాక్టీస్‌ చేసింది. ఇక అక్టోబర్‌ 6వ తేదీన పాకిస్థాన్‌ నెదర్లాండ్స్‌ టీమ్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us