IPL 2025: ఇదెక్కడి చెత్త బ్యాటింగ్ సామీ.. చూడలేక నిద్రలోకి జారుకున్న చెన్నై ఆటగాడు

Chennai Super Kings IPL 2025 Slump: చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2025లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన ఇవ్వడంలో విఫలమవుతోంది. మొదటి మ్యాచ్ గెలిచిన చెన్నై జట్టు.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై పేలవమైన బ్యాటింగ్ ప్రదర్శనతో ఓ ఆటగాడు నిద్రపోతున్న ఫొటో సోషల్ మీడియాతో తెగ వైరలవుతోంది.

IPL 2025: ఇదెక్కడి చెత్త బ్యాటింగ్ సామీ.. చూడలేక నిద్రలోకి జారుకున్న చెన్నై ఆటగాడు
Chennai Super Kings Ipl 2025 Slump

Updated on: Apr 06, 2025 | 6:40 AM

Chennai Super Kings IPL 2025 Slump: ఐపీఎల్ (IPL) 2025 చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు ఒక పీడకలలా మారింది. తొలి మ్యాచ్‌లో బలమైన ముంబై జట్టును ఓడించి విజయంతో సీజన్ ఆరంభించిన చెన్నై.. ఆ తర్వాత నుంచి గెలవడానికి ఇబ్బంది పడుతోంది. ఈ సీజన్‌లో చెన్నై జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ముఖ్యంగా 4వ మ్యాచ్‌లో చెన్నై ప్రదర్శన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. చెన్నై జట్టు తమ సొంత మైదానమైన చెపాక్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) చేతిలో 25 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో చెన్నై జట్టు బ్యాటింగ్ చేసిన తీరు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. ఇది అభిమానులకే కాదు, జట్టు ఆటగాళ్లకు కూడా బోరింగ్‌లా మారింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో డగౌట్‌లో నిద్రపోతున్న చెన్నై టీంమేట్ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

పేలవంగా మారిన చెన్నై బ్యాటింగ్..

ఏప్రిల్ 5, శనివారం చెన్నైలోని చారిత్రాత్మక చెపాక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో, ఆతిథ్య జట్టు బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. ఢిల్లీ నిర్దేశించిన 184 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై జట్టు పేలవమైన ఆరంభాన్ని పొందడమే కాకుండా వరుసగా వికెట్లు కూడా కోల్పోతూ వచ్చింది. ఢిల్లీ నిర్దేశించిన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెన్నై జట్టు నుంచి ఒక్క ఆటగాడు కూడా దూకుడుగా బ్యాటింగ్ చేయలేదు. దీంతో చెన్నై జట్టు కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయింది. కానీ, విజయానికి దగ్గరగా కూడా రాలేకపోయింది.

ఇవి కూడా చదవండి

నిద్రలోకి జారుకున్న టీంమేట్..

ఢిల్లీ బౌలర్లను ఎదుర్కొనలేకపోయిన చెన్నై బ్యాటర్లు.. స్వేచ్ఛగా పరుగులు సాధించడంలో ఇబ్బంది పడ్డారు. సీఎస్‌కే ఆటగాళ్ల ఈ పరిస్థితిని చూసి చెన్నై అభిమానులు నిరాశ చెందారు. అభిమానులే కాకుండా, చెన్నై జట్టు యువ ఆటగాడు వంశ్ బేడీ కూడా చెన్నై జట్టు స్లో బ్యాటింగ్ చేయడం చూసి నిద్రలోకి జారుకున్నాడు. చెన్నై బ్యాటింగ్ చేస్తున్నప్పుడు డగౌట్‌లో రవీంద్ర జడేజా పక్కన కూర్చున్న వంశ్ బేడీ నిద్రపోతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..