Unbreakable Records: 41 సిక్సర్లు, 39 ఫోర్లు.. 487 పరుగులతో బీభత్సం.. ఈ రికార్డ్ బద్దలవ్వడం కష్టమే భయ్యో..
Unbreakable Cricket Record: ఈ మ్యాచ్‌లో మొత్తం 41 సిక్సర్లు కనిపించాయి. 2023 సంవత్సరంలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 35 సిక్సర్లు కనిపించాయి. కానీ, ఇప్పుడు ఈ రికార్డు బద్దలైంది. ఇప్పుడు ఈ 41 సిక్సర్ల రికార్డు టీ20లో బద్దలవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

Unbreakable Cricket Record: క్రికెట్ ప్రపంచంలో చాలా రికార్డులు ఉన్నాయి. ప్రస్తుతం టీ20 ఆసియా కప్ ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ఈ టోర్నమెంట్ మధ్యలో, నమ్మడానికి చాలా కష్టమైన టీ20 రికార్డు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మ్యాచ్‌లో, బౌలర్లు అలాగే చూస్తుండిపోవడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో, సిక్సర్ల రికార్డును నెలకొల్పారు. దీనిని బద్దలు కొట్టడం కష్టం అనిపిస్తుంది. సమం చేయడం కూడా కష్టంగానే ఉంది.
అంతర్జాతీయ మ్యాచ్‌లో నమోదైన భారీ రికార్డ్..
ఇది దేశీయ క్రికెట్ లేదా మైనర్ క్రికెట్ రికార్డు కాదు. ఓ అంతర్జాతీయ క్రికెట్‌లో నమోదైంది. 2 నెలల క్రితం, బల్గేరియా వర్సెస్ జిబ్రాల్టర్ జట్లు టీ20 మ్యాచ్‌లో ముఖాముఖి తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో, బల్గేరియా జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. జిబ్రాల్టర్ ఓపెనర్లు వేగంగా ఆడటం మొదలుపెట్టి సిక్సర్లతోనే మాట్లాడడం కనిపించింది. ఫిలిప్ రెక్స్ అనే ఓపెనర్ కేవలం 33 బంతుల్లో 73 పరుగులు చేసి 8 సిక్సర్లు, 4 ఫోర్లు కొట్టాడు.
జిబ్రాల్టర్ కెప్టెన్ లెన్ లాటిన్ కూడా అద్భుతమైన హాఫ్ సెంచరీ సాధించాడు. అతను తన ఇన్నింగ్స్‌లో 2 సిక్సర్లు, 7 ఫోర్లు కూడా కొట్టాడు. ఈ జట్టు బ్యాటర్స్ మొత్తం 18 సిక్సర్లు బాదారు. వేగవంతమైన ఇన్నింగ్స్ కారణంగా, జిబ్రాల్టర్ స్కోరు బోర్డుపై 243 పరుగుల భారీ స్కోరును నమోదు చేశాడు.
21 సిక్సర్లు బాదిన ముగ్గురు బ్యాటర్స్..
బల్గేరియాకు చెందిన ముగ్గురు బ్యార్స్ ఫోర్లు, సిక్సర్లతో భారీగా పరుగులు సాధించారు. జట్టు కెప్టెన్, ఓపెనర్ కేవలం 19 పరుగులకే ఔటయ్యారు. కానీ, ఆ తర్వాత విధ్వంసం కనిపించింది. ఇసా జారు అనే బ్యాటర్ కేవలం 24 బంతుల్లో 69 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. నంబర్ 3 బ్యాటర్ 27 బంతుల్లో 69 పరుగులు చేశాడు. అందులో 7 సిక్సర్లు, 5 ఫోర్లు ఉన్నాయి. నంబర్ 5 బ్యాట్స్‌మెన్ కూడా అద్భుతంగా రాణించి 21 బంతుల్లో 9 సిక్సర్లు, 3 ఫోర్లతో 70 పరుగులు చేసి మ్యాచ్‌ను గెలుచుకున్నాడు.
సిక్స్‌ల రికార్డుతో బీభత్సం..
ఈ మ్యాచ్‌లో మొత్తం 41 సిక్సర్లు కనిపించాయి. 2023 సంవత్సరంలో దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 35 సిక్సర్లు కనిపించాయి. కానీ, ఇప్పుడు ఈ రికార్డు బద్దలైంది. ఇప్పుడు ఈ 41 సిక్సర్ల రికార్డు టీ20లో బద్దలవుతుందా లేదా అనేది ఆసక్తికరంగా ఉంటుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




