Perth Test : అదో బుర్ర లేని జట్టు..యాషెస్ ఓటమిని జీర్ణించుకోలేక ఇంగ్లాండ్‌ను దారుణంగా తిట్టిన మాజీ కెప్టెన్
ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్‌ను ఇంగ్లాండ్ ఓడిపోవడంతో ఆ జట్టుపై మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జట్టు ప్రదర్శనపై ఏమాత్రం దాపరికాలు లేకుండా విమర్శలు గుప్పించిన వాన్, ఈ ఓటమి ప్రభావం చాలా కాలం పాటు ఉంటుందని హెచ్చరించారు.

Perth Test : ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ల మధ్య జరుగుతున్న ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో తొలి టెస్ట్ మ్యాచ్‌ను ఇంగ్లాండ్ ఓడిపోవడంతో ఆ జట్టుపై మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జట్టు ప్రదర్శనపై ఏమాత్రం దాపరికాలు లేకుండా విమర్శలు గుప్పించిన వాన్, ఈ ఓటమి ప్రభావం చాలా కాలం పాటు ఉంటుందని హెచ్చరించారు. పెర్త్ లో ఇంగ్లాండ్‌కు ఎదురైన ఈ అవమానకరమైన ఓటమి జట్టును తీవ్రంగా నష్టపరుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
కాయో స్పోర్ట్స్‌తో మాట్లాడిన మైఖేల్ వాన్.. తమ జట్టు ఆట తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ఈ ఓటమి ఇంగ్లాండ్‌ను భారీగా దెబ్బతీస్తుంది. ఇది వారిని డ్యామేజ్ చేస్తుంది. అసలు ఏం జరిగిందో కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు కూడా అర్థం కావడం లేదు. కేవలం నాలుగున్నర గంటల క్రికెట్ గురించి మాట్లాడుతున్నాం. ఆ సమయంలో వారు డామినేటింగ్ పొజిషన్‌లో లేకపోయినా, కనీసం గేమ్‌పై కంట్రోల్ ఉంచుకోవచ్చు కదా. ఆస్ట్రేలియాను ఓడించడానికి వారికి నిజంగా అవకాశం ఉంది. కానీ వారు ఇన్నింగ్స్ చివర్లో కేవలం 12 పరుగులకే 5 వికెట్లు కోల్పోయారు” అని వాన్ విశ్లేషించారు.
“వారికి నిజంగా పోటీ పడటానికి కావలసిన టూల్స్ ఉన్నాయి, కానీ మీరు మెదడు లేకుండా పోటీ పడలేరు. వారు ఆడిన విధంగా ఒకే స్టైల్‌లో ఆడటం సరికాదు అందుకే వారు త్వరగా ఓడిపోయారు” అని వాన్ తీవ్రంగా విమర్శించారు. వాన్ విమర్శలపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, తమ దూకుడు విధానం అంటే బజ్‌బాల్‌ను సమర్థించుకున్నాడు. కఠిన పరిస్థితుల్లో బౌలర్లను ఎదుర్కొని, వారిని వారి లెంగ్త్ నుంచి తప్పించే ధైర్యం చేసిన ఆటగాళ్లకే ఈ మ్యాచ్‌లో విజయం దక్కిందని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు.
అయితే, బజ్‌బాల్ క్రికెట్‌తో ప్రత్యర్థి జట్లను ఓడించడంలో పేరుగాంచిన ఇంగ్లాండ్‌ను, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ట్రావిస్ హెడ్ అదే తరహా దూకుడు సెంచరీతో ఓడించాడు. ట్రావిస్ హెడ్ విజృంభించినప్పుడు అతన్ని ఆపడానికి కెప్టెన్ స్టోక్స్ లేదా టీమ్ మేనేజ్‌మెంట్ వద్ద ఎలాంటి ఆల్టర్నేటివ్ ప్లాన్ లేకపోవడం ఇంగ్లాండ్‌కు పెద్ద లోటుగా మారింది. ఇంగ్లాండ్ ప్లాన్ చేసేలోపే హెడ్ మ్యాచ్‌ను ముగించేశాడు.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
