BGT 2025: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ గెలిచే జట్టు ఇదే.. బిగ్ షాకిచ్చిన రికీ పాటింగ్

India vs Australia: నవంబర్ 22 నుంచి భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. మొదటి మ్యాచ్ పెర్త్‌లో జరగనుండగా, రెండో మ్యాచ్‌కు అడిలైడ్ ఆతిథ్యం ఇవ్వనుంది. విశేషమేమిటంటే.. ఈ సిరీస్ రెండో టెస్టు మ్యాచ్ పింక్ బాల్‌తో జరగనుంది.

BGT 2025: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ గెలిచే జట్టు ఇదే.. బిగ్ షాకిచ్చిన రికీ పాటింగ్
Ind Vs Aus
Follow us

|

Updated on: Aug 13, 2024 | 2:28 PM

Border-Gavaskar Trophy: భారత్, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌పై చర్చలు మొదలయ్యాయి. నవంబర్‌లో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఎవరు గెలుస్తారనే ప్రశ్నకు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ సమాధానమిచ్చాడు. దీని గురించి రికీ పాంటింగ్ మాట్లాడుతూ, ఇది ఉత్కంఠతను కలిగించే సిరీస్ అంటూ చెప్పుకొచ్చాడు. గత రెండు సిరీస్‌లలో ఇక్కడ జరిగిన పరిణామాల తర్వాత స్వదేశంలో పుంజుకోవడం ఆస్ట్రేలియాకు సువర్ణావకాశం.

ఎందుకంటే ఈసారి ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరగనుంది. గత రెండు ఎడిషన్లలో కేవలం నాలుగు టెస్టు మ్యాచ్‌లు మాత్రమే జరిగాయి. ఐదు టెస్టులు ఆడేందుకు ప్రతి ఒక్కరూ నిజంగా ఉత్సాహంగా ఉన్నారని భావిస్తున్నాను అని రికీ పాంటింగ్ తెలిపాడు.

అలాగే ఐదు మ్యాచ్‌లు ఉన్నందున కొన్ని మ్యాచ్‌లు డ్రా అయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ సిరీస్‌ను 3-1 తేడాతో ఆస్ట్రేలియా కైవసం చేసుకుంటుందని రికీ పాంటింగ్ జోస్యం చెప్పుకొచ్చాడు.

అంటే రికీ పాంటింగ్ ప్రకారం, ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో భారత్ కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలుస్తుంది. 3 మ్యాచ్‌లు ఆసీస్ గెలుస్తుందని 3-1 తేడాతో గెలిచి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని కైవసం చేసుకుంటుందని పాటింగ్ అభిప్రాయపడ్డాడు.

చివరిసారిగా 2014-15లో బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఆ తర్వాత వరుసగా మూడుసార్లు సిరీస్‌ను టీమిండియా కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాలో జరిగిన గత రెండు సిరీస్‌లను 2-1 తేడాతో టీమిండియా కైవసం చేసుకోవడం విశేషం.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజేతలు:

సీజన్ విజేత మ్యాచ్‌లు ఆధిక్యం ఆతిథ్యం
1996/97 భారతదేశం 1 1-0 భారతదేశం
1997/98 భారతదేశం 3 2-1 భారతదేశం
1999/00 ఆస్ట్రేలియా 3 3-0 ఆస్ట్రేలియా
2000/01 భారతదేశం 3 2-1 భారతదేశం
2003/04 డ్రా 4 1-1 ఆస్ట్రేలియా
2004/05 ఆస్ట్రేలియా 4 2-1 భారతదేశం
2007/08 ఆస్ట్రేలియా 4 2-1 ఆస్ట్రేలియా
2008/09 భారతదేశం 4 2-0 భారతదేశం
2010/11 భారతదేశం 2 2-0 భారతదేశం
2011/12 ఆస్ట్రేలియా 4 4-0 ఆస్ట్రేలియా
2012/13 భారతదేశం 4 4-0 భారతదేశం
2014/15 ఆస్ట్రేలియా 4 2-0 ఆస్ట్రేలియా
2016/17 భారతదేశం 4 2-1 భారతదేశం
2018/19 భారతదేశం 4 2-1 ఆస్ట్రేలియా
2020/21 భారతదేశం 4 2-1 ఆస్ట్రేలియా

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ షెడ్యూల్:

జట్లు తేదీ సమయం స్థానం
1వ టెస్టు, ఆస్ట్రేలియా vs భారత్ శుక్రవారం, 22 నవంబర్ 2024 7:50 AM పెర్త్
2వ టెస్టు, ఆస్ట్రేలియా vs భారత్ (D/N) శుక్రవారం, 6 డిసెంబర్ 2024 9:30 AM అడిలైడ్
3వ టెస్టు, ఆస్ట్రేలియా vs భారత్ శనివారం, 14 డిసెంబర్ 2024 5:50 AM బ్రిస్బేన్
4వ టెస్టు, ఆస్ట్రేలియా vs భారత్ గురువారం, 26 డిసెంబర్ 2024 5 AM మెల్బోర్న్
5వ టెస్టు, ఆస్ట్రేలియా vs భారత్ శుక్రవారం, 3 జనవరి 2025 5 AM సిడ్నీ

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..