జస్ప్రీత్ బుమ్రా, స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన 1వ టెస్టు మ్యాచ్‌లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. బుమ్రా 4/17 గణాంకాలతో ఆస్ట్రేలియాను 67/7 వద్ద కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అతని ఈ స్పెల్‌కు క్రికెట్ ప్రముఖల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయ. ఇక బూమ్రా ప్రదర్శనపై అతని భార్య సంజనా గణేశన్ అనూహ్యంగా ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా స్పందించింది.
సంజనా, తన భర్త బుమ్రా ఫోటోను పోస్టు చేస్తూ.. “గొప్ప బౌలర్, ఇంకా గొప్ప బూటీ” అంటూ వ్యాఖ్యానించింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బుమ్రా పేస్ స్పెల్‌తో పాటు, సంజనా గణేశన్ స్పందన ఈ మ్యాచ్‌కి అదనపు ఆకర్షణగా నిలిచింది.
నాథన్ మెక్‌స్వీనీ (10)ను LBWగా ఔట్ చేసిన బుమ్రా.. ఆస్ట్రేలియాను తొలి దెబ్బ కొట్టాడు. అనంతరంత ఉస్మాన్ ఖవాజా (8) క్యాచ్‌ను కోహ్లి పట్టడంతో రెండో వికెట్ తీసి ఆసీస్ ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. అంతే కాదు అనంతరం క్రీజు లోకి వచ్చిన స్టీవ్ స్మీత్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని LBWగా అవుట్ చేశాడు. ఇక ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ (3)ను కూడా ఔట్ చేశాడు.
మహ్మద్ సిరాజ్ రెండు కీలక వికెట్లు తీసుకున్నాడు, లబుషేన్ (2)ను LBWగా అవుట్ చేయడం మ్యాచ్ లో కీలకం. హర్షిత్ రాణా తన తొలి వికెట్‌గా ట్రావిస్ హెడ్ (11)ను బౌల్డ్ చేశాడు. లబుషేన్ను స్లిప్‌లో కోహ్లీ డ్రాప్ చేసినప్పటికీ, తర్వాత ఖవాజా క్యాచ్‌ను అందుకున్నాడు.
భారత బ్యాటింగ్ విఫలమై 150 పరుగులకే ఆలౌట్ కావడంతో, బుమ్రా నేతృత్వంలోని పేస్ దాడి భారత జట్టును తిరిగి పోటీలోకి తెచ్చింది. అయితే జోష్ హేజిల్‌వుడ్ (4/29) భారత బ్యాటింగ్‌ను కూల్చివేసి, ఆస్ట్రేలియాకు మొదటి ఆధిక్యం కల్పించాడు. స్టంప్స్ సమయానికి, అలెక్స్ కారీ (19*) మరియు మిచెల్ స్టార్క్ (6*) క్రీజులో నిలిచి ఉన్నారు. ఆటలో కీలకంగా నిలిచిన బుమ్రా, తన స్ఫూర్తిదాయక కెప్టెన్సీతో జట్టును మళ్లీ గెలుపు దిశగా నడిపించగలడా అన్నది ఆసక్తికరంగా మారింది.