Border-Gavaskar trophy: అతనికి మంచి ఫ్యూచర్ ఉంది: మాజీ యువ టీమ్ కోచ్
హర్షిత్ రాణా, భారత క్రికెట్‌కు బహుళ-ఫార్మాట్ బౌలర్‌గా మారే సామర్థ్యం ఉన్న ప్రతిభావంతుడైన పేసర్. అతని కోచ్ నేగి, వేగం, ఫిట్‌నెస్ మెరుగుదలతో పాటు పోరాట పటిమ హర్షిత్ విజయానికి మూలాధారం అని చెప్పారు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనే మెరుగుపడి జట్టుకు ముఖ్యమైన ఆస్తిగా మారగలడని అభిప్రాయపడ్డారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్ట్ లో అరంగ్రేటం చేసిన హర్షిత్ రాణా ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. ఐపీఎల్ నుంచి అనుహ్యంగా టీమిండియాకు ఎంపికైన హర్షిత్ రాణా ఎదుగుదల అందరికి ఆశ్చర్యం కలిగించిన అతని మాజీ కోచ్ ఎన్‌ఎస్ నేగికి మాత్రం ఎలాంటి ఆశ్చర్యాన్ని కలిగించలేదట. హర్షిత్ భారతదేశానికి బహుళ-ఫార్మాట్ బౌలర్‌గా మారగల సామర్థ్యం ఉన్నాడని నేగి ప్రారంభ దశల్లోనే గుర్తించారు. 2022లో గుజరాత్ టైటాన్స్‌తో నెట్ బౌలర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించిన హర్షిత్, 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
అంతర్జాతీయ వేదికపై తన అరంగేట్రాన్ని పెర్త్ టెస్టులో మూడు వికెట్ల ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హర్షిత్ ప్రతిభావంతుడైన బౌలర్ అని, గత రెండు రంజీ ట్రోఫీ సీజన్లలో అతని అద్భుతమైన ప్రదర్శన అందుకు నిదర్శనమని నేగి తెలిపారు. హర్షిత్ కేవలం 10 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లోనే 43 వికెట్లను సాధించడంతో పాటు 42.63 సగటుతో రాణించాడు. ఇది అతనిలో ఉన్న ప్రతిభకు సూచికగా నిలిచింది. “2018లో హర్షిత్‌ను ఢిల్లీ U19 జట్టులోకి ఎంపిక చేసినప్పటి నుంచి అతని ఆటను నిశితంగా పరిశీలించాను. వేగంతో పాటు ఫిట్‌నెస్ మెరుగుదల అతని ప్రగతికి ప్రధాన కారణం” అని నేగి అభిప్రాయపడ్డారు.
హర్షిత్‌లో ఉన్న పోరాట పటిమ, అతనిలోని అభివృద్ధికి కీలకంగా మారిందని నేగి గుర్తించారు. బౌలింగ్‌లో మాత్రమే కాదు, బ్యాటింగ్‌లో కూడా మెరుగుపడి దిగువ ఆర్డర్‌లో 30-40 పరుగులు చేయగల సామర్థ్యం ఉన్న వ్యక్తిగా హర్షిత్‌ను అభివర్ణించారు. జస్ప్రీత్ బుమ్రా వంటి దిగ్గజ ఆటగాళ్ల నుండి ఎక్కువ నేర్చుకోవడం, తన బలాలను వినియోగించడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో విజయం సాధించవచ్చని నేగి హర్షిత్‌కు సలహా ఇచ్చారు.
హర్షిత్ భారత జట్టుకు భవిష్యత్తులో అత్యుత్తమ బౌలర్‌గా మారుతాడనే నమ్మకాన్ని నేగి వ్యక్తం చేశారు. ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడం, తన బౌలింగ్ వేగాన్ని పెంచుకోవడం, అలాగే క్రమంగా అభివృద్ధి చెందుతూ జట్టులో కీలక పాత్ర పోషించగల వ్యక్తిగా ఎదగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.