ప్రస్తుతం దేశమంతా రామనామం జపిస్తోంది. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 22న జరిగే ఈ మహాక్రతువు కోసం అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కానుంది. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజున దేశంలోని అన్ని ఆలయాలు కూడా సిద్ధం కావాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ఇందుకోసం దేవాలయాలన్నింటినీ స్వచ్ఛందంగా శుభ్రం చేయాలని సూచించారు. ప్రధాని పిలుపును అందుకున్న ఇప్పటికే చాలామంది తమ తమ ప్రాంతాల్లోని దేవాలయాలను శుభ్రం చేస్తున్నారు. అనంతరం వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను తీసి సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ తమ భక్తిని చాటుకుంటున్నారు. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు. ఆలయాలను క్లీనింగ్ చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు. ఢిల్లీలోని కరోల్ బాగ్‌లోని శివాలయాన్ని సందర్శించిన ఆయన స్వయంగా ఆలయాన్ని క్లీన్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
స్టార్ క్రికెటర్, ఎంపీ అయి ఉండి కూడా గంభీర్ తన సింప్లిసిటీని చాటుకున్నారంటూ అభిమానులు, నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక బాలీవుడ్ సీనియర్ హీరో జాకీష్రాప్ కూడా రామాలయాన్ని శుభ్రం చేశారు. స్వయంగా గుడి మెట్లను క్లీన్ చేస్తూ కనిపించారు. అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా దేవాలయాలను శుభ్రం చేసిన తర్వాత ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించాలని ప్రధాని మోడీ పిలుపు ఇచ్చారు. సెలబ్రిటీలు స్వచ్ఛ అభియాన్ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు.
#WATCH | Delhi | BJP MP and former Cricketer Gautam Gambhir cleans the premises of Shiv Mandir in Karol Bagh as part of the cleanliness drive. pic.twitter.com/HGumv9iHRf
— ANI (@ANI) January 17, 2024
#WATCH | Maharashtra: Amruta Fadnavis wife of Maharashtra Deputy CM Devendra Fadnavis & Bollywood actor Jackie Shroff took part in the cleanliness drive of the oldest Ram temple in Mumbai. (14.01) pic.twitter.com/mhdkzcNB5x
— ANI (@ANI) January 14, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..