వరల్డ్‌లోనే బెస్ట్.. బ్యాటర్లకు పీడకలలా మారిన బౌలర్.. కట్ చేస్తే.. టీమిండియా మిగిల్చిన చేదు జ్ఞాపకం..

|

Dec 16, 2022 | 12:54 PM

అది 1980వ దశకం. ఆ సమయంలో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు ప్రపంచంలోని ప్రతి బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించారు.

వరల్డ్‌లోనే బెస్ట్.. బ్యాటర్లకు పీడకలలా మారిన బౌలర్.. కట్ చేస్తే.. టీమిండియా మిగిల్చిన చేదు జ్ఞాపకం..
Garner
Follow us on

అది 1980వ దశకం. ఆ సమయంలో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్లు ప్రపంచంలోని ప్రతి బ్యాట్స్‌మెన్‌కు ముచ్చెమటలు పట్టించారు. వారిలో బిగ్ బర్డ్ అని పిలువబడే జోయెల్ గార్నర్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. గార్నర్ ఈరోజు అంటే డిసెంబర్ 16న తన 70వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ఆరడుగుల 8 అంగుళాల పొడవున్న బౌలర్ ఎప్పుడూ భిన్నంగా కనిపిస్తాడు. ఏడడుగుల ఎత్తు నుంచి గంటకు 150 కి.మీ వేగంతో వస్తున్న బంతిని ఎదుర్కోవడం ఏ బ్యాట్స్‌మెన్‌కు అంత సులువు కాదు. గార్నర్ తన కెరీర్‌లో 58 టెస్టు మ్యాచ్‌లు ఆడి 259 వికెట్లు పడగొట్టాడు. అదే సమయంలో, వన్డేల్లో 146 వికెట్లు సాధించాడు. అలాగే అతడి ODI కెరీర్‌లో ఎకానమీ రేటు 3.09, ఇది ప్రపంచంలోనే అత్యుత్తమం. ఇప్పటికీ ఈ రికార్డు చెరగలేదు.

ఇదిలా ఉంటే.. బ్యాట్స్‌మెన్‌లను భయపెట్టిన ఈ బౌలర్‌కు టీమిండియా ఆవేదన మిగిల్చింది. 1983 ప్రపంచకప్‌ ఫైనల్‌లో విజయం సాధించి వెస్టిండీస్ హ్యాట్రిక్ టైటిల్స్‌ను కైవసం చేసుకునేందుకు తహతహలాడగా.. కట్ చేస్తే ఆ టైటిల్‌ను భారత్‌ ఎగరేసుకునిపోయింది. గార్నర్ ఈ ఓటమిని తన కెరీర్‌లో అత్యంత బాధాకరమైన ఓటమిగా అభివర్ణించాడు.

ఈ ఓటమికి బ్యాట్స్‌మెన్లే కారణమని గార్నర్ ఆరోపించాడు. ‘మేము చిన్న లక్ష్యాన్ని ఛేజ్ చేసినప్పుడు, ఒక ప్లేయర్.. తర్వాత మరొకరు తన వెనుక వచ్చే ఆటగాడు ఈ పని పూర్తి చేస్తాడని భావించారు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్లే అప్పుడు ఓడిపోయాం. చిన్న లక్ష్యాన్ని కూడా చేధించలేకపోయాం’. ఇక మ్యాచ్ తర్వాత మేము హోటల్‌కు తిరిగి వచ్చినప్పుడు, లాబీలో దాదాపు 5000 మంది భారతీయ అభిమానులు.. ”మేము మిమ్మల్ని ఓడించాం” అని వెక్కిరించారు. స్పోర్ట్స్ స్టార్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన జోయెల్ తన కెరీర్‌లోని అత్యుత్తమ క్షణాలను కూడా పేర్కొన్నాడు. అతడు మాట్లాడుతూ, ‘1979 ఫైనల్ అత్యుత్తమమైనది. నా యార్కర్లు అద్భుతాలు చేశాయి. జట్టు గెలిచినప్పుడు చాలా ఆనందించాను’. ఈ మ్యాచ్‌లో గార్నర్ 11 ఓవర్లు వేసి ఐదు వికెట్లు పడగొట్టాడు.