IND vs NED: ఏంది సామీ ఈ బౌలింగ్.. ఫిగర్స్ చూస్తే పరేషాన్ అవ్వాల్సిందే.. టీ20 ప్రపంచకప్‌లో భారీ రికార్డ్..

|

Oct 27, 2022 | 5:21 PM

Bhuvneshwar Kumar: ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌నకు ముందు భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ గురించి చాలా ప్రశ్నలు తలెత్తాయి. అయితే తాజా మ్యాచ్‌లో ఈ సీనియర్ భారత బౌలర్ విమర్శకులకు ఘాటుగా సమాధానమిచ్చాడు.

IND vs NED: ఏంది సామీ ఈ బౌలింగ్.. ఫిగర్స్ చూస్తే పరేషాన్ అవ్వాల్సిందే.. టీ20 ప్రపంచకప్‌లో భారీ రికార్డ్..
Bhuvneshwar Kumar
Follow us on

ICC ప్రపంచ కప్-2022లో భారత జట్టు అద్భుతంగా ఆరంభించింది. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను ఓడించింది. గురువారం జరిగిన రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ జట్టును కూడా మట్టికరిపించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియాకు చెందిన ఓ సీనియర్ బౌలర్ అద్భుతంగా రాణించాడు. ఈ బౌలర్ ఎవరు, అతను ఏమి చేశాడో ఇప్పుడు చూద్దాం.. ఆ సీనియర్ బౌలర్ ఎవరో కాదు.. భువనేశ్వర్ కుమార్ గురించి మాట్లాడుతున్నాం. నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్, మూడో ఓవర్‌ను భువనేశ్వర్ బౌలింగ్ చేశాడు. ఈ రెండు ఓవర్లను భువనేశ్వర్ మెయిడిన్‌గా వేశాడు. భువీ తన రెండో ఓవర్ రెండో బంతికి వికెట్ కూడా తీశాడు. తొలి రెండు ఓవర్ల లెక్కలు ఓసారి చూద్దాం.. 0,0,0,0,0,0,0,W,0,0,0,0 గా సంధించాడు. దీంతో టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లో తొలి రెండు ఓవర్లలో మెయిడిన్లు వేసిన సెలెక్ట్ బౌలర్లలో భువనేశ్వర్ పేరు రాసిపెట్టుకున్నాడు.

భువనేశ్వర్ కంటే ముందు, 2012 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై ఇంగ్లండ్ ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ ఈ లిస్టులో నిలిచాడు. అతని తర్వాత 2014 ప్రపంచకప్‌లో నెదర్లాండ్స్‌పై శ్రీలంకకు చెందిన నువాన్ కులశేఖర, న్యూజిలాండ్‌పై రంగనా హెరాత్ ఓపెనింగ్ రెండు మెయిడిన్‌లను బౌల్డ్ చేశాడు. ఈ ముగ్గురి తర్వాత భువనేశ్వర్ ఈ లిస్టులో చేరాడు.

మరోవైపు టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల విషయానికి వస్తే.. భువనేశ్వర్ రెండోసారి భారత్ తరపున ఈ పని చేశాడు. అంతకుముందు మిర్పూర్‌లో జరిగిన 2016 ఆసియాకప్‌లో యూఏఈపై ఈ ఘనత సాధించాడు.

ఇవి కూడా చదవండి

2012లో కొలంబోలో ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 ఇంటర్నేషనల్స్‌లో భవనేశ్వర్ కంటే ముందు, హర్భజన్ సింగ్ రెండు ఓవర్లలో మెయిడిన్లు బౌలింగ్ చేశాడు. హర్భజన్ తర్వాత, మిర్పూర్‌లో పాకిస్థాన్‌పై జస్ప్రీత్ బుమ్రా రెండు ఓవర్లలో మెయిడిన్ బౌలింగ్ చేశాడు.

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. తొలి మ్యాచ్‌లో పాక్‌ జట్టును చిత్తు చేసిన రోహిత్ సేన.. రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్ టీంను కూడా భారీ తేడాతో ఓడించింది. టీమిండియా 180 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక నెదర్లాండ్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 56 పరుగుల తేడాతో విజయం సాధించి, గ్రూప్ 2లో అగ్రస్థానం చేరింది. విరాట్ 44 బంతుల్లో 62, సూర్య 25 బంతుల్లో 51, రోహిత్ 39 బంతుల్లో 53 పరుగులు చేశారు.

ఇరుజట్లు..

భారత ప్లేయింగ్ XI: KL రాహుల్, రోహిత్ శర్మ(c), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్(w), అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్

నెదర్లాండ్స్ ప్లేయింగ్ XI: విక్రమ్‌జిత్ సింగ్, మాక్స్ ఓడౌడ్, బాస్ డి లీడ్, కోలిన్ అకెర్‌మాన్, టామ్ కూపర్, స్కాట్ ఎడ్వర్డ్స్(w/c), టిమ్ ప్రింగిల్, లోగాన్ వాన్ బీక్, షరీజ్ అహ్మద్, ఫ్రెడ్ క్లాసెన్, పాల్ వాన్ మీకెరెన్