Video: వామ్మో.. ఇదేం క్యాచ్ భయ్యా.. క్రికెట్ చరిత్రలోనే ది బెస్ట్ అంటోన్న నెటిజన్స్.. వీడియో చూస్తే నమ్మలేరంతే
Viral Catch Video: ఈ ఆశ్చర్యకరమైన క్యాచ్ తర్వాత, బ్యాట్స్‌మెన్‌తో సహా అభిమానులు షాక్ అయ్యారు. కొందరు అభిమానులు తమ కళ్లను నమ్మలేకపోయారు. అయితే, చాలా కష్టంగా అనిపించిన క్యాచ్‌ని ఫీల్డర్ అప్పటికే పట్టేశాడు. దీంతో బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరుకోవాల్సి వచ్చింది. కానీ, ఫీల్డర్ వెనుకకు పరిగెత్తి క్యాచ్ పట్టుకున్న తీరు బ్యాట్స్‌మెన్‌తో సహా అభిమానులకు అంత తేలికగా నమ్మలేకపోతున్నారు.

Best Catch Of Cricket History: క్రికెట్ మైదానంలో ఎన్నో గొప్ప క్యాచ్‌లను చూసి ఉన్నాం. అయితే ఓ క్యాచ్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన క్యాచ్ ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్ నుంచి చూడొచ్చు. ఈ క్యాచ్ చూసిన అభిమానులు ఆశ్చర్యపోయారు. క్రికెట్ చరిత్రలో ఇదే బెస్ట్ క్యాచ్ అంటూ సోషల్ మీడియాలో అభిమానులు అంటున్నారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్..
ఈ వీడియోలో బ్యాట్స్‌మన్ భారీ షాట్ కొట్టాడు. కానీ, సర్కిల్ దగ్గర నిలబడి ఉన్న ఫీల్డర్ తన వెనుకవైపు వేగంగా పరిగెడుతున్నాడు. ఈ ఫీల్డర్ దాదాపు బౌండరీ దగ్గరకు పరిగెత్తి క్యాచ్ తీసుకున్నాడు. ఈ క్యాచ్‌లోని ప్రత్యేకత ఏమిటంటే ఫీల్డర్ చాలా దూరం వెనుకకు పరుగెత్తడం. అలాగే, బంతిని క్యాచ్ పెట్టే సమయంలో బౌండరీని తాకుతున్నట్లు అనిపించింది. అయితే, ఆ తర్వాత బంతిని పైకి అంటే గ్రౌండ్‌లోకి విసేరేశాడు. ఆ తర్వాత సమీపంలో నిలబడి ఉన్న ఫీల్డర్ ఆ బంతిని క్యాచ్ అందుకున్నాడు.
క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్ పట్టిన ఫీల్డర్..
WHAT A CATCH…..!!!!! 🔥🫡
– One of the greatest fielding efforts in cricket history. [Rob Moody]pic.twitter.com/1ScwmXBz5P
— Johns. (@CricCrazyJohns) January 13, 2024
ఈ ఆశ్చర్యకరమైన క్యాచ్ తర్వాత, బ్యాట్స్‌మెన్‌తో సహా అభిమానులు షాక్ అయ్యారు. కొందరు అభిమానులు తమ కళ్లను నమ్మలేకపోయారు. అయితే, చాలా కష్టంగా అనిపించిన క్యాచ్‌ని ఫీల్డర్ అప్పటికే పట్టేశాడు. దీంతో బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరుకోవాల్సి వచ్చింది. కానీ, ఫీల్డర్ వెనుకకు పరిగెత్తి క్యాచ్ పట్టుకున్న తీరు బ్యాట్స్‌మెన్‌తో సహా అభిమానులకు అంత తేలికగా నమ్మలేకపోతున్నారు. ఇప్పటి వరకు ఇలాంటి క్యాచ్ చూడలేదంటూ సోషల్ మీడియాలో అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యంత ఆశ్చర్యకరమైన క్యాచ్‌గా నిలిచింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
