- Telugu News Photo Gallery Cricket photos MI Cape Town Captain Kieron Pollard Creates New Record In T20 Cricket in SA20 League
T20 Cricket: టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డ్.. మాజీ ముంబై ఆటగాడి దెబ్బకు హిస్టరీ ఛేంజ్..
Kieron Pollard Records: పొలార్డ్ T20 క్రికెట్‌లో 567 ఇన్నింగ్స్‌లు ఆడి 1 సెంచరీ, 58 అర్ధ సెంచరీలతో 12430 పరుగులు చేశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో 3వ ర్యాంక్‌ను చేరుకున్నాడు. ప్రస్తుతం రన్ పొలార్డ్ ఎంఐ కేప్ టౌన్ కెప్టెన్‌గా ఉన్నాడు. దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఎస్ఏ20 లీగ్‌లో తన జట్టును అగ్రస్థానంలో నిలిపేందుకు శాయశక్తుల ప్రయత్నాలు చేస్తున్నాడు.
Updated on: Jan 14, 2024 | 11:42 AM

దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ఎస్ఏ20 లీగ్ 4వ మ్యాచ్‌లో ఎంఐ కేప్ టౌన్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో అత్యుత్తమ ఫీల్డింగ్ చేసిన పొలార్డ్ రెండు క్యాచ్‌లు పట్టాడు.

ఈ 2 క్యాచ్‌లతో టీ20 క్రికెట్‌లో 350 క్యాచ్‌లు పట్టిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా నిలిచాడు. టీ20 క్రికెట్‌లో 300+ క్యాచ్‌లు పట్టిన ఏకైక ఫీల్డర్‌గా కూడా పొలార్డ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

ఈ జాబితాలో దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ రెండో స్థానంలో ఉన్నాడు. మిల్లర్ 457 టీ20 మ్యాచ్‌ల్లో 287 క్యాచ్‌లు అందుకున్నాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన 2వ ఫీల్డర్‌గా నిలిచాడు.

ప్రస్తుతం 639 టీ20 మ్యాచ్‌లు ఆడిన వెస్టిండీస్‌కు చెందిన కీరన్ పొలార్డ్ మొత్తం 350 క్యాచ్‌లు పట్టాడు. దీని ద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా పొలార్డ్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.

టీ20 క్రికెట్‌లో 567 ఇన్నింగ్స్‌లు ఆడిన పొలార్డ్ 1 సెంచరీ, 58 అర్ధసెంచరీలతో 12430 పరుగులు చేశాడు. దీంతో టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ల జాబితాలో 3వ ర్యాంక్‌ను ఆక్రమించాడు. క్రిస్ గేల్ 14562 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.





























