PM Modi: ‘నమో నంబర్ వన్’.. ప్రధాని మోడీని ఘనంగా సత్కరించిన బీసీసీఐ.. టీమిండియా జెర్సీ బహూకరణ

|

Jul 04, 2024 | 4:12 PM

సుమారు ఎనిమిది నెలల క్రితం వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఫైనల్లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. తీవ్ర నిరాశలో మునిగిపోయిన భారత జట్టు ఆటగాళ్లను ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యేకంగా కలిశారు. దుఃఖంలో ఉన్న ప్లేయర్లను ఓదార్చారు.

PM Modi: నమో నంబర్ వన్.. ప్రధాని మోడీని ఘనంగా సత్కరించిన బీసీసీఐ.. టీమిండియా  జెర్సీ బహూకరణ
PM Modi, Jay Shah
Follow us on

సుమారు ఎనిమిది నెలల క్రితం వన్డే ప్రపంచకప్‌ ఫైనల్ లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఫైనల్లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించింది. తీవ్ర నిరాశలో మునిగిపోయిన భారత జట్టు ఆటగాళ్లను ప్రధాని నరేంద్ర మోదీ డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యేకంగా కలిశారు. దుఃఖంలో ఉన్న ప్లేయర్లను ఓదార్చారు. ఇప్పుడు చిత్రం మారిపోయింది. భారత జట్టు బార్బడోస్ వెళ్లి భారత జెండాను నాటింది. టీ20 ప్రపంచకప్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్న టీమిండియా 17 ఏళ్ల తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చింది. టీమ్ ఇండియా ఆటతీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న భారత బృందం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ఈ సమయంలో దాదాపు గంటన్నర పాటు టీమ్‌తో చర్చ జరిగింది. ఈ ఇంటర్వ్యూ వీడియో బయటకు వచ్చి ట్రెండింగ్‌లో ఉంది. కాగా, బీసీసీఐ తరపున ప్రధాని నరేంద్ర మోడీని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోదీకి టీమిండియా జెర్సీని బహుమతిగా ఇచ్చారు. దీనిపై ‘నమో అని రాసి ఉంది.

‘ప్రపంచకప్ లో విజయం సాధించిన భారత క్రికెట్ జట్టు ఈరోజు గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీజీని ఆయన అధికారిక నివాసంలో కలిసింది. సర్, మీ స్ఫూర్తిదాయకమైన మాటలు మరియు టీమిండియాకు అమూల్యమైన మద్దతు ఇచ్చినందుకు మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై హింద్’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది.కాగా భారత ట్టును కలవడంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా ట్వీట్ చేశారు. “ఛాంపియన్‌లతో గొప్ప సమావేశం. ప్రపంచకప్ విజేత జట్టుకు అపూర్వ స్వాగతం లభించింది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి

కాగా, సాయంత్రం 5 గంటలకు మెరైన్ డ్రైవ్ నుంచి టీమిండియా విజయయాత్ర బయలుదేరనుంది. ఇందులో పాల్గొనేందుకు క్రీడాభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే వాంఖడేకి ఉచిత ప్రవేశం ఉన్నందున మైదానం కిక్కిరిసిపోతుందనడంలో సందేహం లేదు. వాంఖడే స్టేడియంలో భారత ఆటగాళ్లను ఘనంగా సత్కరించనున్నారు. ఈ సందర్భంగా భారత జట్టుకు బీసీసీఐ 125 కోట్ల నజరానా అందజేయనుంది.

 

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..