BCCI: మహిళా క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్‌.. ఇకపై ఆ విషయంలో పురుషులతో సమానంగా..

లింగ సమానత్వానికి పెద్దపీట వేస్తూ పురుషులతో పాటు మహిళా క్రికెటర్లకు సమానంగా మ్యాచ్ ఫీజులు చెల్లించనున్నాం. ఈశుభవార్తను తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను' అని ట్విట్టల్‌లో రాసుకొచ్చారు జైషా.

BCCI: మహిళా క్రికెటర్లకు బీసీసీఐ గుడ్‌న్యూస్‌.. ఇకపై ఆ విషయంలో పురుషులతో సమానంగా..
Team India

Updated on: Oct 27, 2022 | 1:15 PM

మహిళా క్రికెటర్లకు బీసీసీఐ శుభావార్త చెప్పింది. ఇకపై వారికి కూడా పురుషులతో సమానంగా వేతనాలు చెల్లించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని బీసీసీఐ సెక్రెటరీ జైషా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ‘క్రికెట్‌లో వివక్షను రూపు మాపేందుకు మేం మొదటి అడుగువేశాం. మ్యాచ్‌ ఫీజుల చెల్లింపుల విషయంలో ఈక్విటీ విధానాన్ని అమలు చేయనున్నాం. లింగ సమానత్వానికి పెద్దపీట వేస్తూ పురుషులతో పాటు మహిళా క్రికెటర్లకు సమానంగా మ్యాచ్ ఫీజులు చెల్లించనున్నాం. ఈశుభవార్తను తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను’ అని ట్విట్టల్‌లో రాసుకొచ్చారు జైషా.  బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇకపై మహిళా క్రికెటర్లకు ఒక టెస్టు మ్యాచ్‌కు రూ. 15 లక్షలు, వన్డే మ్యాచ్‌కు 6 లక్షలు, టీ20కి రూ.3 లక్షల పారితోషకం అందనుంది. కాగా పురుష క్రికెటర్లు, మహిళళకు సమానంగా మ్యాచ్ ఫీజు చెల్లించిన రెండో దేశంగా భారత్‌ అవతరించింది. అంతకుముందు, ఈ ఏడాది జూలైలో న్యూజిలాండ్ కూడా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.కాగా పురుష క్రికెటర్లు, మహిళళకు సమానంగా మ్యాచ్ ఫీజు చెల్లించిన రెండో దేశంగా భారత్‌ అవతరించింది. అంతకుముందు, ఈ ఏడాది జూలైలో న్యూజిలాండ్ కూడా ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది.

కాగా పురుషులు, మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులను సమం చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. తాజాగా బీసీసీఐ దానిని నెరవేర్చింది. బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం చరిత్రాత్మకమని ప్రశంసలు వినిపిస్తున్నాయి. కాగా ఇంతకుముందు మహిళా క్రికెటర్లు టెస్ట్ మ్యాచ్ ఫీజు రూ. 4 లక్షలు, ఒక్కో వన్డే మ్యాచ్‌కు 2 లక్షలు, టీ20 మ్యాచ్‌లు ఆడినందుకు 2.5 లక్షలు తీసుకునేవారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..