Sanju Samson : అభిషేక్ శర్మ ఫ్లాప్.. సంజూ శాంసన్ హిట్.. అయినా సెలక్టర్లకు తన మీద నమ్మకం లేదా?
Sanju Samson : కెప్టెన్‌గా జట్టును నడిపించడంలో సూర్య సక్సెస్ అయినా, వ్యక్తిగతంగా పరుగులు చేయడంలో తడబడుతున్నారు. దీనికి తోడు 2028 లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా సరికొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Sanju Samson : భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తు ఇప్పుడు సందిగ్ధంలో పడింది. ఆయన నేతృత్వంలో ఈ ఏడాది టీమిండియా టీ20 ప్రపంచకప్ గెలిచినప్పటికీ, బ్యాటర్‌గా సూర్య ఫామ్ కోల్పోవడం బీసీసీఐని కలవరపెడుతోంది. కెప్టెన్‌గా జట్టును నడిపించడంలో సూర్య సక్సెస్ అయినా, వ్యక్తిగతంగా పరుగులు చేయడంలో తడబడుతున్నారు. దీనికి తోడు 2028 లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో ఉంచుకుని, దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా సరికొత్త కెప్టెన్‌ను ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
శ్రేయస్ అయ్యర్ వైపే మొగ్గు చూపిస్తున్న సెలక్టర్లు
సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్సీ నుంచి తప్పిస్తే ఆ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బలమైన అభ్యర్థిగా కనిపిస్తున్నారు. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ జట్టు తరఫున శ్రేయస్ అయ్యర్ అద్భుతమైన ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు. వన్డే జట్టులో ఇప్పటికే ఆయనను వైస్ కెప్టెన్‌గా ప్రమోట్ చేయడం సెలక్షన్ కమిటీకి ఆయనపై ఉన్న నమ్మకాన్ని చూపిస్తోంది. అయితే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. శ్రేయస్‌తో పాటు శుభమన్ గిల్, ఇషాన్ కిషన్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి.
వరల్డ్ కప్ హీరో సంజూ శాంసన్‌కు నిరాశేనా?
ఈ కెప్టెన్సీ రేసులో స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ పేరు ప్రముఖంగా వినిపించినప్పటికీ, బీసీసీఐ ఆయన వైపు మొగ్గు చూపడం లేదని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. 2026 టీ20 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ కేవలం 5 మ్యాచ్‌ల్లోనే 321 పరుగులు చేసి భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచారు. టోర్నీ ప్రారంభంలో ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ విఫలం కావడంతో సంజూ శాంసన్‌కు అవకాశం దక్కింది. ఈ అవకాశాన్ని రెండు చేతులా వాడుకున్న సంజూ, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో హాఫ్ సెంచరీలతో చెలరేగి భారత్‌కు కప్పు అందించారు.
అస్థిరత్వమే సంజూ శాంసన్‌కు మైనస్
ప్రపంచకప్‌లో అంతటి అద్భుత ప్రదర్శన చేసినా, సంజూ శాంసన్ కెరీర్‌లో ఉన్న ఇన్‌కన్సిస్టెన్సీ ఆయనకు మైనస్‌గా మారిందని బోర్డు వర్గాలు అంటున్నాయి. ఒక మ్యాచ్‌లో బాగా ఆడి, తర్వాతి మ్యాచ్‌ల్లో విఫలం కావడం సెలక్టర్లకు నచ్చడం లేదు. టీ20 వరల్డ్ కప్‌లో వైస్ కెప్టెన్‌గా ఉన్న అక్షర్ పటేల్, అలాగే యంగ్ అండ్ డైనమిక్ ప్లేయర్ ఇషాన్ కిషన్ రేసులో ఉన్నారు. సంజూ శాంసన్‌కు ప్రస్తుతానికి కేవలం ఇటీవల ప్రదర్శన మాత్రమే కలిసివచ్చే అంశం తప్ప, సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించేందుకు కీ స్టేక్‌హోల్డర్స్ సుముఖంగా లేరని సమాచారం.
ఐపీఎల్ కెప్టెన్సీ అనుభవం ఉన్నా తప్పని తిరస్కరణ
నిజానికి సంజూ శాంసన్‌కు కెప్టెన్సీ అనుభవం లేకపోలేదు. గతంలో ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టును కెప్టెన్‌గా అద్భుతంగా నడిపించారు. 2022 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ జట్టును ఫైనల్స్ వరకు తీసుకువెళ్లారు. అయితే ఐపీఎల్ 2026 సీజన్ లో ఆయన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టుకు ప్రాతినిధ్యం వహించి, రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్సీ కింద ఆడారు. ఐపీఎల్‌లో మంచి లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయని నిరూపించుకున్నప్పటికీ, టీమిండియా అంతర్జాతీయ సమీకరణాలు వేరుగా ఉండటంతో సంజూ శాంసన్‌కు కెప్టెన్సీ దక్కడం కష్టంగానే కనిపిస్తోంది.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
