AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BCCI Plan: న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు మాస్టర్ ప్లాన్.. రెడ్ బాల్ క్రికెట్ ఆడనున్న టీమిండియా స్టార్ ప్లేయర్లు

BCCI Plan: న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ సన్నాహకాల్లో భాగంగా టీమిండియా సీనియర్ ఆటగాళ్లు రంజీ ట్రోఫీ ఆడనున్నారు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెడ్ బాల్ మ్యాచ్‌ల్లో బరిలోకి దిగనున్నారు. అక్టోబర్ 11 నుంచి ప్రారంభమయ్యే రంజీ ట్రోఫీ 2026-27 సీజన్‌లో వీరు కనీసం ఒక మ్యాచ్ ఆడే అవకాశం ఉందని బీసీసీఐ వెల్లడించింది.

BCCI Plan: న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్‌కు మాస్టర్ ప్లాన్.. రెడ్ బాల్ క్రికెట్ ఆడనున్న టీమిండియా స్టార్ ప్లేయర్లు
Indian Team
Rakesh
|

Updated on: Sep 30, 2026 | 3:00 PM

Share

BCCI Plan: న్యూజిలాండ్‌తో జరగబోయే అత్యంత కీలకమైన టెస్ట్ సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఈ టూర్ సన్నాహకాల్లో ఎలాంటి లోపాలు లేకుండా చూసుకునేందుకు సీనియర్ ఆటగాళ్లను రంజీ ట్రోఫీ 2026-27లో ఆడించాలని భావిస్తోంది. అక్టోబర్ 22 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ముందుగా ఐదు టీ20లు, ఆ తర్వాత నవంబర్ 4 నుంచి నాలుగు వన్డేలు జరగనున్నాయి. నవంబర్ 19 నుంచి ప్రారంభమయ్యే రెండు టెస్టుల సిరీస్‌ కోసం టీమిండియా ఆటగాళ్లను పూర్తి స్థాయిలో సిద్ధం చేయాలని బోర్డు నిశ్చయించుకుంది.

ఎవరెవరు ఏ జట్లకు ఆడనున్నారు?

అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీలో భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పంజాబ్ తరఫున, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కర్ణాటక తరఫున కనీసం ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ఆడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా రెడ్ బాల్‌తో ప్రాక్టీస్ పొందేందుకు గుజరాత్ తరఫున రంజీ మ్యాచ్ ఆడటమా లేక ఇండియా-ఎ మ్యాచ్‌లో బరిలోకి దిగడమా అనే అంశంపై స్పష్టత రానుంది. గాయం నుంచి కోలుకున్న ఆకాశ్ దీప్, నితీష్ కుమార్ రెడ్డిల ఫిట్‌నెస్‌ను కూడా సెలెక్టర్లు నిశితంగా పరిశీలిస్తున్నారు.

డబ్ల్యూటీసీ ఫైనల్ రేస్

2024లో స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 0-3తో వైట్‌వాష్‌కు గురైంది. స్వదేశీ మైదానంలో క్లీన్‌స్వీప్ అవ్వడం భారత క్రికెట్ చరిత్రలో నిరాశజనక ఘట్టంగా నిలిచింది. ఆ చేదు జ్ఞాపకాలను చెరిపివేసేందుకు, ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC 2025-27) రేసులో నిలబడేందుకు ఈ పర్యటన కీలకంగా మారింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 51.52 విజయ శాతంతో ఐదో స్థానంలో ఉంది. 11 మ్యాచ్‌లలో 5 గెలిచి, 4 ఓడిపోగా, 2 మ్యాచ్‌లను డ్రాగా ముగించింది. 72.22 శాతంతో మూడో స్థానంలో ఉన్న న్యూజిలాండ్‌పై విజయం సాధిస్తేనే భారత్‌ ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us