Team India: శుభ్మన్ గిల్‌ను కెప్టెన్ చేయడం వెనుక ఇంత పెద్ద రీజన్ ఉందా.. గంభీర్ స్కెచ్ మాములుగా లేదుగా?

భారత క్రికెట్ జట్టుకు శుభ్‌మాన్ గిల్ కొత్త టెస్ట్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. రోహిత్ శర్మ తర్వాత ఈ బాధ్యతను స్వీకరించిన గిల్ యువత, ఫామ్, కొత్త కోచ్‌తో మంచి అనుబంధం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇది భవిష్యత్తు కోసం దూరదృష్టితో తీసుకున్న నిర్ణయం అని బీసీసీఐ విశ్వసిస్తుంది. గిల్‌ కెప్టెన్సీ కాలం జట్టుకు ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో చూడాలి.

Team India: శుభ్మన్ గిల్‌ను కెప్టెన్ చేయడం వెనుక ఇంత పెద్ద రీజన్ ఉందా.. గంభీర్ స్కెచ్ మాములుగా లేదుగా?
Shubman Gill

Updated on: May 25, 2025 | 1:29 PM

Shubman Gill: భారత క్రికెట్ నియంత్రణ మండలి శనివారం ఇంగ్లాండ్ పర్యటనకు భారత జట్టును ప్రకటించింది. రోహిత్ శర్మ తర్వాత, శుభ్‌మాన్ గిల్‌ను టీమ్ ఇండియా టెస్ట్ కెప్టెన్‌గా నియమించారు. కాగా, రిషబ్ పంత్ జట్టుకు వైస్ కెప్టెన్. శుభ్‌మాన్ గిల్‌ను భారత జట్టు కెప్టెన్‌గా చేయడానికి కారణం ఏమిటి? బీసీసీఐ ఈ కీలుగు అడుగు ఎందుకు తీసుకుంది? ఈ మూడు కారణాల వల్ల బీసీసీఐ మర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జట్టుకు కెప్టెన్సీ వహించడానికి శుభ్‌మాన్ గిల్ సరైన ఎంపిక అని స్పష్టంగా చూపించే 3 ప్రధాన కారణాలను ఇక్కడ తెలుసుకుందాం..

విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేందుకు..

ఇంగ్లాండ్ సిరీస్ నుంచి శుభ్‌మాన్ గిల్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించనున్నాడు. శుభ్‌మాన్ గిల్ కెప్టెన్‌గా ఉండటమే కాకుండా, జట్టులో విరాట్ కోహ్లీ స్థానంలో కీలక బాధ్యతలు తీసుకోనున్నాడు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ ఓపెనింగ్ జోడీగా ఆడటానికి వస్తే, శుభ్‌మాన్ గిల్ నంబర్-4 స్థానంలో బ్యాటింగ్ చేయడం కనిపిస్తుంది. గత కొన్ని సిరీస్‌ల నుంచి అతను టీమ్ ఇండియా తరపున పరుగులు చేస్తున్నాడు. ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాడు. అతను టీం ఇండియాలో కింగ్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయగలడు.

శుభ్‌మాన్ గిల్ చాలా కాలం కెప్టెన్‌గా ఉండగలడు..

ఓపెనర్ శుభ్‌మాన్ గిల్ వయసు ప్రస్తుతం 25 సంవత్సరాలు. ఇటువంటి పరిస్థితిలో, అతను చాలా కాలం జట్టు కెప్టెన్‌గా ఉండగలడు. శుభ్‌మాన్ గిల్ భారత జట్టు టెస్ట్ కెప్టెన్‌గా ఉండటమే కాకుండా, పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో టీమ్ ఇండియా వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. గిల్‌ను కెప్టెన్‌గా ఎంచుకోవడానికి ఇది కూడా ఒక పెద్ద కారణం. మహేంద్ర సింగ్ ధోని తర్వాత విరాట్ కోహ్లీ, కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీ కాలాలు ఒకదానికొకటి తక్కువగా ఉన్నాయి. కానీ, యువ గిల్‌ను కెప్టెన్‌గా చేయడం ద్వారా, టీమ్ ఇండియా ఎక్కువ కాలం కెప్టెన్సీ ప్రశ్నతో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.

ఇవి కూడా చదవండి

శుభ్‌మాన్ గిల్ కొత్త కోచ్‌తో మంచి అనుబంధం..

గౌతమ్ గంభీర్ టీం ఇండియా హెడ్ కోచ్‌గా నియమితుడైన తర్వాత , రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో ఆయనకు విభేదాలు వచ్చాయని అనేక వార్తలు వచ్చాయి. అయితే, దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన ఎప్పుడూ విడుదల కాలేదు. కానీ, స్టార్ ఆటగాళ్లు, ప్రధాన కోచ్ మధ్య సమన్వయం లోపించిందని వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఇప్పుడు యువ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ చేతిలో కెప్టెన్సీ ఉండటంతో, కొత్త కోచ్‌తో అతని సమన్వయం మెరుగ్గా ఉంటుంది. అయితే, గౌతమ్ గంభీర్ కోచింగ్ పదవీకాలం కూడా 2027 సంవత్సరం తర్వాత ముగుస్తుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..