ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2024) సీజన్-2 షెడ్యూల్ వచ్చేసింది ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహిళల క్రికెట్ టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుండగా, మార్చి 17న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈసారి రెండు నగరాల్లో టోర్నీ జరగబోతోంది. దీని ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం తొలి దశ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అలాగే ఫైనల్‌తో సహా రెండో దశ మ్యాచ్‌లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ గ్రౌండ్‌లో జరగనున్నాయి. మహిళల ప్రీమియర్ లీగ్ సీజన్-2 తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. అలాగే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫిబ్రవరి 24 నుండి తమ WPL సమరాన్ని ప్రారంభించనుంది. వారి మొదటి మ్యాచ్‌లో UP వారియర్స్‌తో తలపడుతుంది. 2023లో జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్‌లో ముంబై ఇండియన్స్ టైటిల్ గెలుచుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో గెలిచి తొలి మహిళల ప్రీమియర్ లీగ్ ట్రోఫీని గెలుచుకుంది.
WPL 2024 పూర్తి షెడ్యూల్:
• 22 Games
• 24 Days
• 5 Teams1 Exciting Tournament – WPL 2024. #CricketTwitter #WPL2024 pic.twitter.com/wRTCfC81j4
— Female Cricket (@imfemalecricket) January 23, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..