
Team India Schedule: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2025 సంవత్సరానికి సంబంధించి స్వదేశంలో టీమిండియా షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ ఏడాది భారత జట్టు స్వదేశంలో రెండు సిరీస్‌లు ఆడనుంది. ఇందులో వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ రెండు భారత సిరీస్‌లు అక్టోబర్, డిసెంబర్ మధ్య జరుగుతాయి. ఇందులో టెస్ట్, వన్డే, టీ 20 ఫార్మాట్లలో మొత్తం 12 మ్యాచ్‌లు జరుగుతాయి. అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో టీం ఇండియా మొదట రెండు టెస్టులు ఆడుతుందని బీసీసీఐ తెలిపింది. ఆ తర్వాత, నవంబర్-డిసెంబర్‌లో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌లు ఉంటాయి.
అక్టోబర్ 2 నుంచి వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్ మొదలుకానుంది. మొదటి మ్యాచ్ అక్టోబర్ 2 నుంచి అహ్మదాబాద్‌లో జరుగుతుంది. సిరీస్‌లోని రెండవ, చివరి టెస్ట్ అక్టోబర్ 10 నుంచి కోల్‌కతాలో జరగనుంది. వెస్టిండీస్ సిరీస్ తర్వాత దక్షిణాఫ్రికాను స్వదేశంలో ఎదుర్కోవలసి ఉంటుంది. ప్రోటీస్ జట్టు భారత పర్యటన నవంబర్ 14 నుంచి ప్రారంభమవుతుంది. ముందుగా రెండు టెస్టుల సిరీస్ ఉంటుంది. మొదటి మ్యాచ్ నవంబర్ 14 నుంచి ఢిల్లీలో జరుగుతుంది. రెండవ, చివరి టెస్ట్ నవంబర్ 22న గౌహతిలో ప్రారంభమవుతుంది. గౌహతి తొలిసారిగా టెస్ట్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది.
🚨Announcement🚨
Fixtures for #TeamIndia (Senior Men) international home season for 2025 announced.
Test series against West Indies, followed by an all-format series against South Africa.
Guwahati to host its maiden Test
Details 🔽https://t.co/s1HyuWSDL2
— BCCI (@BCCI) April 2, 2025
భారత్, దక్షిణాఫ్రికా మధ్య వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఉంటాయి. ఈ సిరీస్ నవంబర్ 30న రాంచీలో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 3న రాయ్‌పూర్‌లో రెండో వన్డే, డిసెంబర్ 6న వైజాగ్‌లో మూడో వన్డే జరుగుతాయి. ఐదు మ్యాచ్‌ల భారత్-దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ డిసెంబర్ 9న కటక్‌లో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత డిసెంబర్ 11న న్యూ చండీగఢ్‌లో రెండో టీ20, డిసెంబర్ 14న ధర్మశాలలో మూడో టీ20, డిసెంబర్ 17న లక్నోలో నాలుగో టీ20, డిసెంబర్ 19న అహ్మదాబాద్‌లో ఐదవ, చివరి టీ20 జరుగుతాయి.
జూన్‌లో ప్రారంభమై ఆగస్టు వరకు కొనసాగే స్వదేశీ సిరీస్‌కు ముందు భారత జట్టు ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి ఉంది. ఈ పర్యటనలో ఐదు టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత ఆసియా కప్‌లో పాల్గొనాల్సి ఉంది. ఈ టోర్నమెంట్‌ను టీ20 ఫార్మాట్‌లో ఆడనున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఆసియా కప్‌నకు భారతదేశం ఆతిథ్యం ఇస్తుంది. కానీ, ఈ టోర్నమెంట్‌ను యూఏఈలో నిర్వహించవచ్చు అని తెలుస్తోంది. ఆ తర్వాత అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో పర్యటించాల్సి ఉంది. అక్కడ మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడాల్సి ఉంది. ఈ పర్యటన అక్టోబర్ 19 నుంచి ప్రారంభమై నవంబర్ 8 వరకు కొనసాగుతుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..