Ind vs Eng : పేసర్ల మధ్య హోరాహోరీ పోరు..లార్ట్స్ టెస్టులో ఎవరిది పై చేయి..గణాంకాలు ఏం చెబుతున్నాయంటే ?
లార్డ్స్ టెస్ట్‌లో భారత్, ఇంగ్లాండ్ పేసర్ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్, జోఫ్రా ఆర్చర్, కార్స్, వోక్స్ వంటి కీలక బౌలర్ల ప్రదర్శనపైనే మ్యాచ్ ఆధారపడి ఉంటుంది. ఆకాష్ దీప్ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే 10 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు.

Ind vs Eng : భారత్, ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో మూడో మ్యాచ్ నేడు, అంటే జూలై 10 నుంచి లార్డ్స్ మైదానంలో ప్రారంభం కానుంది. ఈసారి మ్యాచ్ గెలుపు బ్యాట్స్‌మెన్ల బ్యాట్ నుంచి కాకుండా, బౌలర్ల మీదే ఆధారపడి ఉంటుంది. భారత్, ఇంగ్లాండ్ రెండు జట్లూ ఈ మ్యాచ్ కోసం పేస్ బౌలర్లను రెడీ చేశాయి. ఇవి ఏ రోజునైనా మ్యాచ్‌ను ఒంటరిగా మలుపు తిప్పగల సత్తా ఉన్న బౌలర్లు వీళ్లు. భారత పేస్ బౌలింగ్ దళంలో జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఆకాష్ దీప్, మొహమ్మద్ సిరాజ్ ఉన్నారు. ఆకాష్ ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో 10 వికెట్లు తీసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అదే మ్యాచ్‌లో సిరాజ్ 7 వికెట్లు తీసి ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్‌లను కట్టడి చేశాడు.
మరోవైపు ఇంగ్లాండ్‌కు జోఫ్రా ఆర్చర్ ఉన్నాడు. 2019 యాషెస్ సిరీస్‌లో ఇదే మైదానంలో జోఫ్రా ఆర్చర్ బౌన్సర్‌తో స్టీవ్ స్మిత్‌ను గాయపరచి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అయితే, ఇప్పుడు అతనికి 30 ఏళ్లు దాటాయి. అతని ఫిట్‌నెస్‌పై ప్రశ్నలు ఉన్నాయి. అతనితో పాటు బ్రైడాన్ కార్స్, క్రిస్ వోక్స్ వంటి అనుభవజ్ఞులైన బౌలర్లు ఉన్నారు. భారత జట్టులో ఒక మార్పుకు అవకాశం ఉంది. అది కుల్దీప్ యాదవ్ లేదా ప్రసిద్ధ్ కృష్ణలలో ఒకరిని ఎంపిక చేయడంపై ఆధారపడి ఉంటుంది. వీరిద్దరిలో ఒకరికి భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ లో చోటు దక్కవచ్చు. ప్రసిద్ధ్ ఎడ్జ్‌బాస్టన్ రెండో ఇన్నింగ్స్‌లో 14 ఓవర్లలో 39 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. కానీ జట్టుకు కుల్దీప్ యాదవ్ కూడా ఒక స్ట్రాంగ్ ఆప్షన్. అతను 13 టెస్టుల్లో 56 వికెట్లు తీశాడు. ఏ పిచ్‌పైనైనా వికెట్లు తీయగల కెపాసిటీ ఉంది. అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత స్పిన్ డిపార్ట్‌మెంట్‌లో అతని బాధ్యత ఇప్పుడు పెరిగింది.
భారత్-ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఇప్పటివరకు పేసర్లు అద్భుతంగా రాణించారు. ఆకాష్ దీప్ కేవలం ఒక్క మ్యాచ్‌లోనే 10 వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. అతని ప్రదర్శన సిరీస్‌లో హైలైట్‌గా నిలిచింది. మరోవైపు మొహమ్మద్ సిరాజ్ 2 మ్యాచ్‌లలో 9 వికెట్లు తీసి నిలకడగా రాణిస్తున్నాడు. స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్క మ్యాచ్‌లోనే 5 వికెట్లు సాధించి తన సత్తా చాటాడు. ఇక ఇంగ్లాండ్ పేసర్ల విషయానికి వస్తే బ్రైడాన్ కార్స్ 2 మ్యాచ్‌లలో 6 వికెట్లు తీశాడు. క్రిస్ వోక్స్ 2 మ్యాచ్‌లలో 3 వికెట్లు పడగొట్టాడు. సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో జోష్ టంగ్ ఉన్నాడు. అతను 2 మ్యాచ్‌లలో ఏకంగా 11 వికెట్లు తీసి ప్రత్యర్థులను వణికించాడు. అయితే, లార్డ్స్ టెస్ట్ కోసం ఇంగ్లాండ్ తుది జట్టు నుంచి జోష్ టంగ్‌ను తొలగించడం గమనార్హం. ఈ గణాంకాలు లార్డ్స్ టెస్ట్‌లో పేసర్ల మధ్య హోరాహోరీ పోటీని సూచిస్తున్నాయి.
భారత జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్(వికెట్ కీపర్, వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, నితీష్ రెడ్డి/ కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్, మొహమ్మద్ సిరాజ్.
ఇంగ్లాండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్(కెప్టెన్), జామీ స్మిత్(వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, షోయెబ్ బషీర్.
మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




